అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊరట: ఆస్తుల వేలానికి గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్: అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊరట లభించింది. ఆ సంస్థ ఆస్తుల వేలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఆర్థికశాస్త్ర నిపుణుడు నర్సింహమూర్తి నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఆర్థిక నేరాల అధ్యయనకమిటీ మూడునెలల్లో డిపాజిటర్లకు చెల్లింపులు జరుపుతామని ఇవాళ ప్రకటించింది. సంస్థ మొత్తం ఆస్తుల విలువ 7 వేల కోట్లని నర్సింహమూర్తి వెల్లడించారు. సంస్థలో మొత్తం 32 లక్షలమంది డిపాజిటర్లు ఉన్నారని, అప్పుల విలువ రు.6,800 కోట్లని తెలిపారు. ముందుగా 5,300మంది డిపాజిటర్లకు చెల్లింపులు చేస్తామని వెల్లడించారు. న్యాయపరమైన అనుమతి లభించగానే ఇ-వేలం ద్వారా ఆస్తులను అమ్ముతామని తెలిపారు. క్యాష్ మేనేజ్‌మెంట్‌పై అవగాహనలేక సంస్థ దివాళా తీసిందని నర్సింహమూర్తి చెప్పారు. అప్పులకంటే ఆస్తుల విలువ ఎక్కువ ఉంది కాబట్టి డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు.

అగ్రిగోల్డ్ సంస్థ ఒక సమయంలో మంచి వెలుగు వెలిగింది అయితే అత్యుత్సాహంతో టీవీ ఛానల్(టాలీవుడ్ టీవీ), ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌(హాయ్‌ల్యాండ్)వంటి ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టటంతో నష్టాల పాలయ్యింది. డిపాజిట్లు మెచ్యూర్ అయినా చెల్లింపులు చేయకపోవటంతో కొందరు డిపాజిటర్లు, డిపాజిటర్ల ఒత్తిడి తట్టుకోలేక కొందరు ఏజెంట్లు ఆత్మహత్యలుకూడా చేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close