ప్రింట్ మీడియాలోకి “ఆహా” – నిజంగానే !?

తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పెట్టి ఏటా వంద కోట్లు నష్టపోతున్నట్లుగా రికార్డులు చూపిస్తున్న ఆహా యాజమాన్యం మీడియాలో అత్యంత ఖర్చుతో కూడుకున్న మరో వెంచర్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆహా పేరుతో ఏకంగా ఓ దినపత్రికనే తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆహా వీడియో అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ” పొద్దున్నే ఒక చేతిలో కాఫీ, మరో చేతిలో పేపర్’ఆహా’ ఆ ఊహే ఎంత బాగుందో కదా!! అందుకే రాబోతుంది ‘ఆహా’ దినపత్రిక ” అంటూ హింట్ ఇచ్చారు.

ఆహా ఓటీటీ ప్రమోటర్లు మైహోం రామేశ్వరరావు , అల్లు అరవింద్. అయితే వీరు ఇతర మీడియా చానళ్లలోనూ కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. వాటాలు కొన్నారు. 10 టీవీలో మైహోం, మెఘా కృష్ణారెడ్డి, అల్లు అరవింద్‌కు వాటాలు ఉన్నాయి. టీవీ9 లో మై హోం రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డి వాటాదారులుగా ఉన్నారు. మీడియాలో ఉన్న పవర్ ఏంటో తెలిసిదేమో కానీ.. ఇప్పుడు పత్రిక కూడా చేతుల్లో ఉంటే ఇంకా బాగుంటుందని అనుకున్నట్లుగా ఉన్నారని అందుకే పత్రికను ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రింట్ మీడియా అవసాన దశలో ఉంది. కొన్ని పత్రికలకు అలవాటుపడిపోయిన వారు తప్ప ఎవరూ న్యూస్ పేపర్ కొనడం లేదు. సర్క్యూలేషన్ పూర్తిగా తగ్గిపోయి ప్రధాన పత్రికలు తంటాలు పడుతున్నాయి. నష్టాల్లోకి వెళ్లిపోతున్నాయి. న్యూస్ ప్రింట్ ధర విపరీతంగా పెరిగింది. ప్రకటనల ఆదాయం పడిపోయింది. పెద్ద పెద్ద పత్రికలు కూడా తమ ఎడిషన్లను తగ్గించుకుంటున్నాయి. ఇప్పుడు ఆహా యాజమాన్యం మాత్రం కొత్తగా పత్రికా రంగంలోకి రావాలనుకోవడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడి ‘ఎస్‌.. బాస్‌’

పిల్ల‌జ‌మిందార్‌, భాగ‌మ‌తి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు అశోక్. ఆ త‌ర‌వాత‌.. అశోక్ ఓ సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. అప్ప‌టి నుంచి అశోక్ ఏం చేస్తున్నాడు? త‌న త‌దుప‌రి సినిమా ఎవ‌రితో అనే...

దక్షిణాదిలో తగ్గిపోయే లోక్‌సభ సీట్లపై కేటీఆర్ ఆందోళన!

దక్షిణాదికి దేశంలో ప్రాధాన్యం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్ సభ సీట్లను తగ్గించబోతున్నారని చాలా కాలంగా పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2026వ...

రైతు భరోసా క్యాలెండర్ తప్పింది !

జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసినా సంక్షేమ క్యాలెండర్ ను మాత్రం వదిలి పెట్టకుండా అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ అది కూడా దారి తప్పుతోంది. చెప్పిన...

బింబిసార-2కి కొత్త దర్శకుడు?

కల్యాణ్‌ రామ్‌ సోషియో ఫాంటసీ 'బింబిసార’ మంచి విజయాన్ని అందుకుంది. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కి మళ్ళీ జోష్ తెచ్చింది. దీనికి పార్ట్ 2 వుంటుందని సినిమా ముగింపులోనే చెప్పారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close