అహ్మదాబాద్ ఐపీఎల్‌ టీంను గెల్చుకున్న బెట్టింగ్ కంపెనీ !

ఐపీఎల్‌లో రెండు కొత్త టీములను ఎంపిక చేశారు. అహ్మదాబాద్, లక్నో టీములకు వేలం పాట నిర్వహించారు. ఇందులో ఆహ్మదాబాద్ జట్టును సీవీసీ పార్టనర్స్ అనే సంస్థ రూ.5600 కోట్లకు దక్కించుకుంది. లక్నో టీమ్‌ను .. ఆర్పీఎస్‌జీ గ్రూప్ రూ. 7,090 కోట్లకు దక్కించుకుంది. ఈ రెండు జట్ల వాల్యూయేషన్ మధ్య తేడా ఏకంగా పదిహేను వందల కోట్ల వరకూ ఉంది. ఇది ఒక విచిత్రం అయితే.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించున్న సీవీసీ పార్టనర్స్‌కు బెట్టింగ్, గేమింగ్ ను అధికారికంగా నిర్వహించే కంపెనీ ఉంది.

సీవీసీ పార్టనర్స్ అనే గ్రూప్ ఇండియాలో నిర్వహించే కార్యకలాపాలు తక్కువే. ఎక్కువ యూరప్ దేశాల్లో ఉంటుంది. యూరప్‌లో చాలా దేశాల్లో బెట్టింగ్ చట్టబద్ధం. ఈ బెట్టింగ్, గేంబ్లింగ్ నిర్వహణలో సీవీసీ పార్టనర్స్ సబ్సిడరీ కంపెనీ అయిన స్కై బెట్టింగ్ అండ్ గేమింగ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ మాతృ సంస్త అయిన సీవీసీ పార్టనర్స్‌ ఇప్పుడు టీమ్‌ను దక్కించుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నిర్వహించడంలో ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది.

నిబంధనల ప్రకారం బెట్టింగ్ కంపెనీలు బిడ్లలో పాల్గొనకూడదని ఏమీ లేదు. ఆర్థిక సామర్థ్యం దిశగా ఉన్న నిబంధనలన్నీ సరిపోలడం.. అహ్మదాబాద్ టీమ్‌కు అందరి కన్నా ఎక్కువగా బిడ్ దాఖలు చేయడంతో వారికి ఆ టీమ్ దక్కింది. ప్రస్తుతం బీసీసీఐ.. అమిత్ షా కుమారుడు జే షా కనుసన్నల్లో నడుస్తోంది. ఆయన స్వరాష్ట్రమైన అహమ్మదాబాద్ నుంచతి ఓ టీం రావడం.. దాన్ని చాలా తక్కువకే బెట్టింగ్ కంపెనీ దక్కించుకోవడం.. అందర్నీలో ఏదో మూల సందేహాలను లేవనెత్తేలా చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా - విక్కీల పెళ్లికీ అంత‌టి...

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close