కేరళ ఎయిర్‌పోర్టులో విమానం రెండు ముక్కలు..!

కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో..విమానం స్కిడ్ అయి రెండు ముక్కలు అయింది. ఓ ముక్క చాలా దూరంగా పడిపోయింది. మరో ముక్క రన్ వే పై ఉండిపోయింది. దుబాయ్ నుంచి ప్రయాణికుల్ని తీసుకుని కోజికోడ్ వస్తోంది ఎయిరిండియా విమానం. ఈ విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు చనిపోయినట్లుగా చెబుతున్నారు. కొంత మందికి గాయాలయ్యాయి. ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున అంబులెన్స్‌లను తరలించారు. పలువుర్ని సమీప ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

కేరళలో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి. కోజికోడ్ ఎయిర్ పోర్టులోనూ… భారీ వర్షం పడింది. రన్ పై నీరు నిలిచి ఉండటంతో… ల్యాండింగ్ సమయంలో… స్కిడ్ అయినట్లుగా అనుమానిస్తున్నారు. విమానం రెండు ముక్కలైనప్పటికీ.. సున్నితమైన … ఇంధనం ఉండే ప్రాంతాల్లో ఎలాంటి డ్యామేజ్ జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మామూలుగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు చెలరేగుతూ ఉంటాయి. ఓ వైపు వర్షం పడుతూండటం… విమానం… మధ్యకు విరగడంతో… ముప్పు తప్పింది.

విమానాలు ఐదు నెలల పాటు ఖాళీగా ఉన్నాయి. అలాగే పైలట్లు కూడా…రోజువారీ విధులకు దూరంగా ఉన్నారు. రన్ వేల నిర్వహణ కూడా అంతంతమాత్రంగానే ఉంది. అలాగే ఎయిరిండియా విమానం.. చాలా పాతదని చెబుతున్నారు. వందే భారత్ మిషన్ లో భాగంగా… ఎయిరిండియా విదేశాల్లో ఉన్న భారతీయుల్ని తీసుకు వస్తోంది. ఇలా స్వదేశానికి వస్తున్న కేరళీయులు… ప్రమాదం బారిన పడ్డారు. ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇంకా క్లారిటీ లేదు కానీ..ప్రాణనష్టం భారీగా లేకుండా ముందు జాగ్రత్తలను తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

అక్టోబ‌ర్ 2: డ‌బుల్ బొనాంజా

ఒకేరోజు రెండు సినిమాలు వ‌స్తే ఆ సంద‌డే వేరుగా ఉంటుంది. థియేట‌ర్లు మూత‌బ‌డిన వేళ‌.. ఒక సినిమా విడుద‌ల కావ‌డ‌మే అద్భుతం అన్న‌ట్టు త‌యారైంది. అయితే ఈసారి ఓకేరోజు రెండు సినిమాలు ఓటీటీ...

ఈపీఎస్, ఓపీఎస్ మధ్యలో శశికళ..!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయం జోరందుకుంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకే ఇది మరీ ఎక్కువగాఉంది. ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి.. ఉపముఖ్యమంమత్రి ఈ.పన్నీర్ సెల్వం మధ్య...

అమరావతికి ముంపు లేదని మరోసారి సర్టిఫికెట్ వచ్చేసిందా..!?

రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని గతంలో హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. దీంతో ముంపు నివారించే పధకం రూపొందించాకే రాజధాని నిర్మాణం పై ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది....

HOT NEWS

[X] Close
[X] Close