నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కున్నా

చిత్ర‌రంగంలో లైంగిక వేధింపులు స‌ర్వ‌సాధార‌ణ విష‌యంగా మ‌రిపోయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ… ఈ విష‌యంలో నోరు మెద‌ప‌లేదు. `చెబితే అవ‌మానం` అని భ‌య‌ప‌డ్డారు. కానీ ఆ భ‌యాల్ని వ‌దిలి.. బ‌య‌ట‌కు వ‌స్తున్నారు క‌థానాయిక‌లు. త‌మ‌పై జ‌రిగిన అఘాయిత్యాల్ని ధైర్యంగా బ‌య‌ట పెడుతున్నారు. అందుకే… ఆ బాధ‌లు మ‌న‌క్కూడా తెలుస్తున్నాయి.

నాపై కూడా లైంగిక దాడులు జ‌రిగాయి, నేనూ లైంగిక వేధింపుల‌కు గురయ్యా అంటోంది ఐశ్వ‌ర్య రాజేష్‌. చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టిన కొత్తలో త‌న‌కు తగినంత పారితోషికాలు ఇవ్వ‌లేద‌ని, పైగా రంగు, శ‌రీర ఛాయ‌ని సాకుగా చూపించేవాళ్ల‌ని బాధ ప‌డుతోంది. ద‌క్షిణాది అమ్మాయిల‌కు ఉత్త‌రాది నుంచి గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని, వాళ్ల‌లా డ్ర‌స్సింగులు చేం కాబ‌ట్టి, వాళ్ల‌లా గ్లామ‌ర్ గా త‌యారు కాలేం కాబ‌ట్టి, అవ‌కాశాలు త‌గ్గిపోతాయ‌ని వాపోయింది. అలాగ‌ని ఐశ్వ‌ర్య ఎక్క‌డి నుంచో దిగి ప‌డిన న‌టి కాదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచే వ‌చ్చింది. ప్ర‌ముఖ న‌టుడు రాజేష్ కుమార్తె ఐశ్వ‌ర్య‌. శ్రీ‌ల‌క్ష్మి కి మేన‌కోడ‌లు అవుతుంది. అయినప్ప‌టికీ ఐశ్వ‌ర్య వేధింపుల‌కు గురైందంటే.. మిగిలిన వాళ్ల ప‌రిస్థితేంటో అర్థం చేసుకోవొచ్చు.

”నేనుబోల్డ్‌గా ఉంటాను. ఆ ల‌క్ష‌ణ‌మే న‌న్ను నిల‌బెట్టింద‌నుకుంటాను. స‌మ‌స్య‌ల్ని స్వీక‌రించ‌డం నాకు తెలుసు. ఎవ‌రూ న‌న్ను న‌మ్మ‌న‌ప్పుడు న‌న్ను నేను న‌మ్మాను. అందుకే.. బాధ‌ల్ని ఓర్చుకున్నాను..” అని చెప్పుకొచ్చింది ఐశ్వ‌ర్య‌. ‘కౌస‌ల్య కృష్ణ‌మూర్తి’లో క్రికెట‌ర్‌గా ఐశ్వ‌ర్య చ‌క్క‌టి న‌ట‌న ప్ర‌ద‌ర్శించింది. ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’లోనూ ఐశ్వ‌ర్య న‌ట‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close