ధ‌నుష్ సినిమాపై ఆశ‌లు ఆవిరి

ఆర్‌.ఎక్స్‌.100 త‌ర‌వాత ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి వ‌చ్చాడు అజ‌య్ భూప‌తి. ఆ సినిమా ఓ ఆర్ డీ ఎక్స్ బాంబ్ లా పేలింది. చిన్న సినిమాగా వ‌చ్చి, పెద్ద విజ‌యం అందుకుంది. కాసుల వ‌ర్షం కురిపించింది. దాంతో స‌హ‌జంగానే అజ‌య్ భూప‌తికి అవ‌కాశాలు వ‌రుస క‌ట్టాయి. కానీ రెండో సినిమా విష‌యంలో ఆచి తూచి అడుగులేశాడు. ఒకే క‌థ ప‌ట్టుకుని హీరోల చుట్టూ తిరిగాడు. మూడేళ్ల త‌ర‌వాత గానీ… త‌న రెండో సినిమా విడుద‌ల కాలేదు. ట్రైల‌ర్ చూస్తే అంద‌రికీ పిచ్చెక్కిపోయింది. ఒక‌టి కాదు, ఏకంగా రెండు ట్రైల‌ర్లు వ‌దిలాడు. విడుద‌ల‌కు ముందే `నా సినిమా బ్లాక్ బ్ల‌స్ట‌ర్‌` అంటూ కాన్ఫిడెన్స్ ప్ర‌క‌టించాడు. ఇదంతా చూసి క‌చ్చితంగా `మ‌హా సముద్రం` సునామీలా విరుచుకుప‌డిపోతుంద‌ని భావించారంతా. కానీ… ఆ అల తీరాన్ని తాక‌కుండానే వెళ్లిపోయింది. ఈ సినిమా ఫ్లాప్ తో .. ద‌ర్శ‌కుల ద్వితీయ వీఘ్నం సెంటిమెంట్ మ‌రోసారి నిజ‌మ‌ని తేలిపోయింది.

కానీ `మ‌హా సముద్రం` సెట్స్‌పై ఉన్న‌ప్పుడు అంతా పాజిటీవ్ వైబ్సే. ఈ సినిమాతో సూప‌ర్ హిట్ కొడ‌తామ‌ని నిర్మాత అనిల్ సుంక‌ర గ‌ట్టిగా న‌మ్మాడు. అందుకే ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లో అజ‌య్ భూప‌తితో మ‌రో సినిమా చేయ‌డానికి ప్లాన్ చేశాడు. మ‌ధ్య‌లో ధ‌నుష్‌కి కూడా క‌థ చెప్పించారు. ధ‌నుష్ కి ఈ క‌థ న‌చ్చినా.. త‌ను తొంద‌ర ప‌డలేదు. `మ‌హా సముద్రం` హిట్ట‌య్యాక చూద్దాం.. అన్నాడు. తీరా ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో… ధ‌నుష్ తో సినిమా ఆశ‌లు ఆవిరైన‌ట్టే. ఆర్‌.ఎక్స్ 100 త‌ర‌వాత అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాత‌లు ఇప్పుడు అజ‌య్ భూప‌తితో సినిమా అంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఉంది. కాక‌పోతే మూడో సినిమా తీయ‌డానికి నిర్మాత దొర‌క్కపోడు. అయితే ఈసారి.. అజ‌య్ భూప‌తి మ‌ళ్లీ తానొచ్చిన దారిలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఆర్‌.ఎక్స్ 100 ఎలాగైతే కొత్త‌వాళ్ల‌తో తీసి, ఏమాత్రం అంచ‌నాల్లేకుండా విడుద‌ల చేశాడో, ఇప్పుడూ అలాంటి మ్యాజిక్కే చేయాలి. ప్ర‌స్తుతం భూప‌తి ప్ర‌య‌త్నం కూడా అదే కావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ సర్కార్ అండ !

జర్నలిస్టుల సంక్షేమంలో మాటలు చెప్పడం కన్నా అంతో ఇంతో ఆచరణలో చూపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. ఇరవై వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం.. ...

HOT NEWS

[X] Close
[X] Close