మీడియా వాచ్‌: మ‌రో శ్రీ‌ధ‌ర్‌ని త‌యారు చేస్తున్న ఈనాడు

రామోజీరావు ద‌త్త‌పుత్రుడి హోదా అనుభ‌వించిన శ్రీ‌ధ‌ర్.. ఈనాడు వ‌దిలి వెళ్లిపోయారు. దానికి కార‌ణాలు అనేకం. కాక‌పోతే… ఇప్పుడు ఈనాడుకి శ్రీ‌ధ‌ర్ స్థానాన్ని భ‌ర్తీ చేసే కార్టూనిస్ట్ కావాలి. శ్రీ‌ధ‌ర్ వెళ్లిన‌ప్ప‌టి నుంచీ పాకెట్ కార్టూన్‌లు రావ‌డం లేదు. ఓర‌కంగా పాకెట్ కార్టూన్లు లేక‌పోవ‌డం ఈనాడు సంప్ర‌దాయ పాఠ‌కుల‌కు రుచించ‌డం లేదు. ఏళ్ల త‌ర‌బ‌డి అల‌వాటు ప‌డిపోయారు క‌దా? వాళ్లంతా మ‌ళ్లీ పాకెట్ కార్టూన్ రావాల‌ని కోరుకుంటున్నారు.

ఈనాడు కూడా అదే ప్ర‌య‌త్నంలో ఉంది. మ‌రో శ్రీ‌ధ‌ర్ ని త‌యారు చేయ‌డానికి అహర్నిశం క‌ష్ట‌ప‌డుతోంది. సంస్థ‌లో ప్ర‌తిభావంతులైన కార్టునిస్టుల‌కు కొద‌వ లేదు. వాళ్లంద‌రినీ జ‌ల్లెడ ప‌ట్టి, అందులో కొంత‌మందిని ఎంపిక చేసుకుంది యాజ‌మాన్యం. వాళ్ల ప‌నేంటంటే.. రోజూ క‌రెంట్ ఎఫైర్స్ కి త‌గ్గ‌ట్టుగా కార్టున్లు వేయ‌డం. ప‌దుల సంఖ్య‌లో వాళ్ల‌తో కార్టున్లు వేయించి, వాటిని నిశితంగా ప‌రిశీలిస్తోంది యాజ‌మాన్యం. ఆ కార్టూన్లు ఏవీ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. జ‌స్ట్… అదో పైలెట్ ప్రాజెక్ట్ అన్న‌మాట‌. శ్రీ‌ధ‌ర్ వేసిన కార్టూన్ల‌పై అంతిమ నిర్ణ‌యం.. రామోజీరావుదే. ఈసారీ అంతే.. ఈ కార్టూన్ల‌న్నీ పెద్దాయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్తున్నాయి. ఆయ‌న వాటిని ప‌రిశీలించి, ఎవ‌రి గీత, ఎవ‌రి రాత బాగుందో – లెక్క‌లేస్తున్నారు. ఈ త‌తంగం ఎప్పుడు పూర్త‌వుతుందో తెలీదు. శ్రీ‌ధ‌ర్ స్థానంలో కార్టూన్ వేయ‌డానికి అర్హుడైన ఆర్టిస్ట్ దొరికేంత వ‌ర‌కూ ఇదే తంతు. ఒక‌వేళ‌.. శ్రీ‌ధ‌ర్ స్థానాన్ని ఇచ్చేంత స్కిల్ ఎవ‌రిలో క‌నప‌డ‌క‌పోతే.. అస‌లు పాకెట్ కార్టూనే వ‌ద్ద‌ని పెద్దాయ‌న గట్టిగా చెప్పాడ‌ట‌. అస‌లు త‌మ కార్టూన్ పబ్లిష్ అవుతందో, లేదో తెలీక‌.. ఎందుకోసం, ఎవ‌రి కోసం కార్టున్లు గీయాలో అర్థం కాక‌.. కార్టునిస్టులంతా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఈ ప్ర‌హ‌స‌నం ఎప్పుడు పూర్త‌వుతుందో, ఈనాడులో పాకెట్ కార్టూన్ ఎప్పుడు చూస్తామో.?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : “ఓ వర్గం” సెలబ్రిటీలకే ప్రభుత్వ సాయమా ? మిగతా వాళ్లు, సామాన్యులు మనుషులు కారా ?

సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఆయన సినిమా పాటలతో ప్రసిద్ధి పొందారు. సినిమా సహజంగానే గ్లామర్ ఫీల్డ్.. ఆయన పాటలు అన్ని వర్గాలను ఆకట్టుకున్నాయి కాబట్టి స్ఫూర్తి పొందిన వారు.. ప్రేరణ పొందిన వారు...

“సెక్రటేరియట్” ఉద్యోగుల పర్మినెంట్ ఎప్పుడు !?

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్ని రెండేళ్ల తర్వాత పర్మినెంట్ చేస్తామని ఏపీ సర్కార్ ప్రకటించి వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. ఇప్పటి వరకూ వారికి ఎలాంటి ప్రత్యేక భత్యాలు లేకుండా కేవలం రూ. పదిహేను...

బీజేపీ నెత్తిన పాలు పోస్తున్న మమత,కేజ్రీవాల్ !

భారతీయ జనతా పార్టీకి ప్లస్ పాయింట్ విపక్షాలే. కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలిచే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇతర పార్టీలతో కలిసి మోడీని ఓడించాలి. కానీ ఆ ఇతర పార్టీల్లోని నేతలు తమను...

అఖండ‌ రివ్యూ – మాస్ జాతర

Akhanda telugu review Telugu360 Rating : 3/5 ఓ మాస్ హీరోని ఎలా చూపించాలో బోయ‌పాటి శ్రీ‌నుకి బాగా తెలుసు. ఫ్యాన్స్ కి ఏం కావాలో, ఎలా కావాలో.. ఆ లెక్క‌ల‌న్నీ బాగా బ‌ట్టీ...

HOT NEWS

[X] Close
[X] Close