అజిత్ ప‌వార్ కి మ‌ళ్లీ ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి..?

మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌తీరోజూ ఏదో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటూ ఉంది. శివ‌సేన‌, ఎన్సీపీ, కాంగ్రెస్ కూట‌మి ప్ర‌భుత్వ ఏర్పాటుకు లైన్ క్లియ‌ర్ అయింది. ప‌ద‌వుల పంపిణీ విష‌యంలో శివ‌సేనకు 16, కాంగ్రెస్ కి 13, ఎన్సీపీకి 15 చొప్పున కేబినెట్ బెర్తుల పంపిణీపై ఒప్పందం కుదిరిన‌ట్టు స‌మాచారం. ముఖ్య‌మంత్రిగా ఉద్ధవ్ థాక్రే, ఇద్ద‌రు ఉప ముఖ్య‌మంత్రులుగా ఎన్సీపీ నుంచి జ‌యంత్ పాటిల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ పేర్లు ఖ‌రారు అయ్యాయ‌ని ముందుగా వార్త‌లొచ్చాయి. వీరిద్ద‌రూ రొటేష‌న్ లో రెండున్న‌రేళ్లు ఒక‌రు చొప్పున ప‌ద‌వుల్లో ఉంటార‌ని ఒప్పందం కుదిరింద‌నీ అన్నారు. కానీ, ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే… అజిత్ ప‌వార్ ఉప ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ముందుగా భాజ‌పాతో క‌లిసి వెళ్లి, మ‌ళ్లీ వెన‌క్కి రావ‌డంతో రాజ‌కీయంగా అజిత్ ప‌వార్ ప‌నైపోయింద‌ని అనుకుంటే… ఎన్సీపీ లెజిస్లేచ‌ర్ పార్టీ ప‌గ్గాలు ఆయ‌న‌కే ద‌క్క‌డం అనూహ్య ప‌రిణామంగా చెప్పొచ్చు! దీంతో ఇప్పుడు వ‌చ్చే రెండున్న‌రేళ్ల‌పాటు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఆయ‌న చేప‌ట్టే అవవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఆయ‌న సీఎం ప‌ద‌వినే డిమాండ్ చేసిన‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కానీ, డెప్యూటీ సీఎంకి ఒప్పందం కుదిరిన‌ట్టు చెబుతున్నారు. నిజానికి, అజిత్ ప‌వార్ భాజ‌పావైపు వెళ్లిన‌ప్పుడు… ఆయ‌న వెంట ఎమ్మెల్యేలు ఎవ్వ‌రూ వెళ్ల‌లేదు. ఆయ‌న్ని శాస‌న స‌భ ప‌క్ష నేత‌గా తొల‌గిస్తూ నిర్ణ‌యం కూడా తీసుకున్నారు. కానీ, ఇప్పుడు తిరిగి రాగానే ఆయ‌న‌కి డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ అదే ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తుండ‌టం విశేషం. భాజ‌పా నుంచి తిరిగి త‌న‌ శిబిరానికి వ‌చ్చాక‌, ఆయ‌నపై ఎలాంటి విముఖ‌తా వ్య‌క్తం కానీయ‌కుండా శ‌ర‌ద్ ప‌వార్ జాగ్ర‌త్త‌లు ప‌డ్డార‌ని అనొచ్చు. 

గురువారం సాయంత్రం జ‌రిగే ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ఆర్.ఎస్.ఎస్. ఛీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ తోపాటు హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీల‌ను శివ‌సేన ఆహ్వానించింది. సీనియ‌ర్ నేత అద్వానీ, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ తోపాటు విప‌క్షాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను కూడా ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి పిలుస్తున్నారు. దీంతో, వీరిలో ఎంత‌మంది ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రౌతారు, వీళ్ల కాంబినేష‌న్ ఎలా కుదురుతుంది అనే ఉత్కంఠ నెల‌కొంది. ఏదేమైనా, గురువారం సాయంత్రం ప్ర‌భుత్వం కొలువు దీర‌డంతో మ‌హా రాజ‌కీయాల్లో గ‌త కొద్దిరోజులుగా నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close