అజిత్ ధోవల్‌కి కోపం తెప్పించిన జగన్..!?

అజిత్ ధోవల్..! సూపర్ జేమ్స్‌బాండ్‌గా ఈయనకు.. దేశంలో పేరు ఉంది. కేంద్ర ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. పేరుకు… ఇది ఓ పదవిలా కానిపిస్తుంది కానీ.. ఆయన ఓ వ్యవస్థగా ఎదిగారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వెనుక వ్యూహాలు మొత్తం ఆయనివే. అంతే కాదు.. ప్రధాని మోడీ.. హోంమంత్రి అమిత్ షాలకు కళ్లు, చెవులు ఆయనే. అలాంటి వ్యక్తి ఆగ్రహానికి ఏపీ సీఎం జగన్ గురయ్యారు. వైసీపీ ఢిల్లీ పెద్దలకు ఈ విషయంపై స్పష్టమైన సమాచారం రావడంతోనే… హడావుడిగా దిద్దుబాటు చర్యలకు దిగినట్లుగా తెలుస్తోంది. పౌరసత్వ బిల్లు తమ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. బీజేపీతో సంబంధాల కోసమే.. మద్దతిస్తున్నామంటూ.. వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

అసలు అజిత్ ధోవల్ జోలికి వైఎస్ జగన్ ఎందుకెళ్లారనే ఆసక్తి.. అంతటా ఏర్పడింది. నిజానికి జగన్ నేరుగా అజిత్ ధోవల్ పై ఎలాంటి విమర్శలు చేయడం కానీ.. ఆయనకు వ్యతిరేకంగా.. ఢిల్లీలో ఎలాంటి కార్యక్రమం కానీ చేపట్టలేదు. ఏపీలో.. ఇంటలిజెన్స్ చీఫ్ గా మనీష్ కుమార్ సిన్హా అనే అధికారిని నియమించడమే.. అజిత్ ధోవల్‌ ఆగ్రహానికి కారణం అయిందంటున్నారు. సహజంగానే.. ధోవల్‌కు ఆగ్రహం వస్తే.. మోడీ, షాలకు వచ్చినట్లే. ధోవల్‌పై.. ఈ మనీష్ కుమార్ సిన్హా… తీవ్ర ఆరోపణలు చేశారు. ధోవల్ అవినీతికి పాల్పడ్డారని.. నేరుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన అప్పట్లో సీబీఐలో ఉన్నారు. కొన్నాళ్ల కిందట.. అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాల మధ్య జరిగిన రచ్చలో మనీష్ కుమార్ సిన్హా ను విచారణ అధికారిగా కోర్టు నియమించింది. విచారణలో ఆయన ధోవల్‌ పేరును పలుమార్లు ప్రస్తావించి..ఆయన కూడా.. లంచాలు తీసుకున్నారన్నట్లుగా రిపోర్ట్ ఇచ్చారు.

ఆ తర్వాత సీబీఐలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. మనీష్ కుమార్ ను.. కేంద్రం సీబీఐ నుంచి సాగనంపింది. ఆయన ఏపీ క్యాడర్ అధికారి కావడంతో… వచ్చి ఏపీలో రిపోర్ట్ చేశారు. ఇంటలిజెన్స్ చీఫ్ పోస్టు కోసం.. అత్యంత నమ్మకస్తుడైన అధికారి కోసం చూసి.. చూసి.. అలసిపోయిన.. ఏపీ సర్కార్.. వెంటనే.. మనీష్ కుమార్ కు.. పదవి అప్పగించేసింది. ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్ కు ఉండే ప్రాధాన్యత దృష్ట్యా ఈ నియామకం ధోవల్‌కి.. కేంద్రానికి కోపం తెప్పించిందంటున్నారు. ఈ నియామకాన్ని జగన్.. కేంద్రాన్ని చల్లబరిచేలా ఎలా సమర్థించుకుంటారో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com