రేపు ఢిల్లీలో విందు – రాజకీయం పసందు..!

ఎవరైనా విందులు ఎందుకిస్తారు..? అదీ కూడా వంద రకాల వంటకాలు.. వెయ్యి రూపాయిల కిళ్లీ.. అంటూ.. విశేషాలు ఎందుకు ప్రచారం చేస్తారు..? ఇంట్లో శుభకార్యం అయితే.. దర్పం చూపించుకోవాలనుకునేవారు అయితే.. ఇలా చేస్తారు. కానీ..ఎలాంటి సందర్భం లేకుండా కాస్ట్‌లీ విందు ఏర్పాటు చేసేవారే.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు. బుధవారం రోజు.. ఆయన ఢిల్లీలో తన వియ్యంకుడైన కాంగ్రెస్ ఎంపీ .. కేవీపీ రామచంద్రరావు ఇంట్లో భారీగా విందు ఇస్తున్నారు. ఆ విందు విశేషాలు.. వారం రోజుల నుంచి.. మీడియాకు.. కొద్దికొద్దిగా చెబుతున్నారు. వంద రకాల వంటకాలు.. అన్ని ప్రదేశాల స్పెషల్స్.. అలాగే.. వెయ్యి రూపాయల విలువైన కిళ్లీ.. ప్రత్యేకమని.. చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు సమయం దగ్గర పడింది కాబట్టి.. రాజకీయం కూడా.. ప్రత్యేకంగా మారిపోయింది.

రఘురామకృష్ణంరాజు.. ఈ విందును.. గెట్ టు గెదర్‌లా ఏర్పాటు చేయలేదు. దాదాపు మూడు వేల మందిని పిలిచి మరీ భారీగా చేస్తున్నారు. అతిధుల జాబితాలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు.. కేంద్రమంత్రివర్గం అంతా ఉంది. ఇతర పార్టీల నేతలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు అతిధుల జాబితాలో ఉన్నారు. రఘురామకృష్ణంరాజు విందుపై.. వైసీపీనేతలు మాత్రమే గుంభనంగా ఉన్నారు. ఎందుకంటే.. ఆయన పూర్తిగా.. వ్యక్తిగత హోదాలో విందు ఏర్పాటు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు.. తమ పర్మిషన్ లేకుండా… ఎవర్నీ కలవడానికే అవకాశం లేదంటే.. ఆయన ఏకంగా.. అందర్నీ పిలిచి విందులు ఇస్తున్నారు.

రఘురామకృష్ణంరాజు బీజేపీ ఫోల్డ్‌లోకి వెళ్లిపోయారన్న ఉద్దేశంతోనే… జగన్.. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య బీజేపీ నేత గోకరాజు గంగరాజు కుటుంబసభ్యులను హడావుడిలో పార్టీలో చేర్చుకుని ప్రత్యామ్నాయం చూసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో… రఘురామకృష్ణంరాజు విందు ఇస్తున్నారు. రఘురామకృష్ణంరాజు మొదటి సారి ఎంపీ అయ్యారు. కానీ తనదైన శైలిలో భిన్నమైన రాజకీయం చేస్తున్నారు. దానికి ఆయన వియ్యంకుడు కేవీపీ కూడా అండగా ఉంటున్నారని.. తాజా పరిణామాలతో తేలుతోంది. ఈ రఘురామ విందు రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close