ఓటీటీలో రాజ‌మౌళి శిష్యుడి సినిమా

రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘ఆకాశ‌వాణి’. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ధారి. ఈ సినిమా ఓ వెరైటీ కాన్సెప్టుతో తెర‌కెక్కుతోంది. నోరు లేని రేడియో… ఓ భ‌యంక‌ర‌మైన విల‌న్ పై ప్ర‌తీకారం ఎలా తీర్చుకుంద‌న్న‌ది స్టోరీ. దాన్ని గంగ‌రాజు ఎలా చూపిస్తాడో మ‌రి..? రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఆర‌కంగా రాజ‌మౌళి సినిమానే ఇది. కాక‌పోతే.. బ‌డ్జెట్ ఎక్క‌డా ప‌రిధులు దాట‌లేదు. రూ3 కోట్ల‌లో సినిమాని ఫినిష్ చేశారు. అంత‌కంటే రూపాయి కూడా ఎక్కువ పెట్ట‌లేదు. ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఓ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌తో `ఆకాశ‌వాణి` బృందం సంప్ర‌దింపులు జ‌రుగుతోంది. మంచి రేటు ప‌లుకుతుండ‌డంతో.. ధైర్యంగా ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి రెడీ అవుతున్నారు. అందులోనూ ఇదో ప్ర‌యోగాత్మ‌క చిత్రం. స్టార్లెవ‌రూ లేరు. థియేట‌ర్లో స్పందన ఎలా ఉంటుందో తెలీదు. ఓటీటీరూపంలో పెట్టుబ‌డి కంటే ఎక్కువే వ‌స్తుండ‌డంతో.. ఓటీటీ రిలీజ్ కే మొగ్గు చూపిస్తున్నారు. త్వ‌ర‌లోనే `ఆకాశ‌వాణి` టీజ‌ర్ రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

అక్టోబ‌ర్ 2: డ‌బుల్ బొనాంజా

ఒకేరోజు రెండు సినిమాలు వ‌స్తే ఆ సంద‌డే వేరుగా ఉంటుంది. థియేట‌ర్లు మూత‌బ‌డిన వేళ‌.. ఒక సినిమా విడుద‌ల కావ‌డ‌మే అద్భుతం అన్న‌ట్టు త‌యారైంది. అయితే ఈసారి ఓకేరోజు రెండు సినిమాలు ఓటీటీ...

ఈపీఎస్, ఓపీఎస్ మధ్యలో శశికళ..!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయం జోరందుకుంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకే ఇది మరీ ఎక్కువగాఉంది. ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి.. ఉపముఖ్యమంమత్రి ఈ.పన్నీర్ సెల్వం మధ్య...

అమరావతికి ముంపు లేదని మరోసారి సర్టిఫికెట్ వచ్చేసిందా..!?

రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని గతంలో హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. దీంతో ముంపు నివారించే పధకం రూపొందించాకే రాజధాని నిర్మాణం పై ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది....

HOT NEWS

[X] Close
[X] Close