వకీల్ సాబ్… వర్క్ మొద‌లైంది

క‌రోనా ఎఫెక్ట్, లాక్ డౌన్‌ల వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కూ ఆటంకం ఏర్ప‌డింది. అయితే కొన్ని సినిమాలు మాత్రం ధైర్యం చేస్తున్నాయి. వీలైనంత వ‌ర‌కూ సినిమాని సిద్ధం చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాయి. అందులో భాగంగా `వ‌కీల్ సాబ్‌`కి సంబంధించిన వ‌ర్క్ కూడా మొద‌లైపోయింద‌ని తెలుస్తోంది. లాక్ డౌన్ వ‌ల్ల‌.. వ‌కీల్ సాబ్ షూటింగ్ వాయిదా ప‌డింది. కాక‌పోతే… దాదాపు మూడొంతుల షూటింగ్ పూర్తయ్యింది. ఇందుకు సంబంధించి ఎడిటింగ్‌, రీ రికార్డింగ్ ప‌నులు మళ్లీ మొద‌ల‌య్యాయి. త‌మ‌న్ ప్ర‌స్తుతం ఆర్‌.ఆర్ ప‌నులు మొద‌లెట్టినట్టు టాక్‌. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి `మ‌గువా.. మ‌గువా` పాట‌ని విడుద‌ల చేశారు. మ‌రో పాట కంపోజింగ్ కూడా పూర్త‌య్యింది. మంచి ముహూర్తం చూసుకుని ఆ పాట‌నీ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. సెప్టెంబ‌రు 2 ప‌వ‌న్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా వ‌కీల్ సాబ్ టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. టీజ‌ర్ క‌టింగ్ కి సంబంధించిన ప‌నులు కూడా జ‌రుగుతున్నాయని, ఈసారి ప‌వ‌న్ బ‌ర్త్ డే ట్రీట్ … అభిమానుల్ని అల‌రించేలా ఉంటుంద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకీ ఈవీఎం ఎన్నికలే కావాలట..!

భారతీయ జనతాపార్టీ ఈవీఎంలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. కరోనా కాలంలో ఒకే ఈవిఎం బటన్‌ను అందరూ అదే పనిగా నొక్కితే కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆందోళనలు వినిపిస్తున్న సమయంలో......

టీడీపీ నుంచి పురందేశ్వరికి సపోర్ట్..!

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవి పొందిన ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి ప్రశంసలు కన్నా ఏపీలో ఎక్కువగా విమర్శలే వస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన నేతలు పెద్దగా అభినందించినట్లుగా కనిపించలేదు కానీ...

పారితోషికాల త‌గ్గింపు.. పెద్ద జోక్‌

ఇండ్ర‌స్ట్రీలో ఎప్పుడూ ఓ మాట వినిపిస్తుంటుంది. ''బ‌డా స్టార్లు పారితోషికాలు త‌గ్గించుకోవాలి..'' అని. త‌రాలు మారినా, ప‌రిస్థితులు మారినా.. ఈ మాట మాత్రం మార‌లేదు. హీరోలు పారితోషికాలు త‌గ్గించుకోలేదు.. నిర్మాత‌లు త‌గ్గించి ఇచ్చిన...

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

HOT NEWS

[X] Close
[X] Close