రొమాంటిక్ ట్రైల‌ర్‌: మోహించుకుంటున్న ప్రేమికులు

ప్రేమ – మోహం… వీటి మ‌ధ్య స్ప‌ష్ట‌మైన తేడా ఉంది. కొంత‌మంది మోహించుకుంటూ అది ప్రేమ అనుకుంటారు. కానీ… ప్రేమ‌లో ఉండి, అది మోహ‌మ‌ని భావించిన ఓ జంట క‌థ‌.. `రొమాంటిక్‌`. పూరి జ‌గన్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. కేతికా శ‌ర్మ క‌థానాయిక‌. అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే… పూరి జ‌గ‌న్నాథ్ స‌మ‌కూరుస్తున్నారు. ఈనెల 29న విడుద‌ల అవుతోంది. ట్రైల‌ర్ ఈరోజు ప్ర‌భాస్ చేతుల మీదుగా విడుద‌లైంది.

దాదాపు 2 నిమిషాల పాటు సాగే ట్రైల‌ర్ ఇది. ఈ సినిమాకి పూరి ద‌ర్శ‌కుడు కాక‌పోయినా.. త‌న స్టైల్‌.. ఆధ్యంతం క‌నిపించింది. హీరో, హీరోయిన్ల క్యారెక్ట‌రైజేష‌న్లు కొత్త‌గా అనిపించాయి. `నువ్వెప్పుడైనా నిన్ను వెన‌క నుంచి చూసుకున్నావా? పిచ్చెక్కిపోతోంది` అంటూ హీరో ప‌లికే డైలాగుల్లో పూరి స్టైల్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కేతికా శ‌ర్మ గ్లామ‌రెస్ గా క‌నిపించింది. ర‌మ్య‌కృష్ణ‌కు ఓ ప‌వ‌ర్ ఫుల్ రోల్ ద‌క్కింది. ఆకాష్‌, ర‌మ్య‌కృష్ణ ఇద్ద‌రూ పోలీస్ దుస్తుల్లో క‌నిపించ‌డం చూస్తుంటే, పోకిరి త‌రహా – ట్విస్ట్ ఏదో క‌థ‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్రేమ‌, మోహం గురించి పూరి మార్కు డైలాగులు బాగా పేలాయి. గోవా నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. గోవా అందాల్ని కెమెరాలో అందంగా బంధించారు. సునీల్ కాశ్య‌ప్ నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటోంది. మొత్తానికి… కుర్ర‌కారుకి బాగా న‌చ్చే సినిమాలా అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.