హుజురాబాద్ భారం పూర్తిగా హరీష్‌దే !

హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి కేసీఆర్ వస్తారని బహిరంగసభ కోసం స్థలాలను హరీష్ రావు వెదుకుతున్నారు కానీ … టీఆర్ఎస్ అధినేత మాత్రం ఈ విషయంలో అంత ఆసక్తిగా లేరు. కేటీఆర్ తాను ప్రచారానికి వెళ్లబోవడం లేదని ప్రకటించారు. కేసీఆర్ పర్యటన కూడా ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ప్రచారానికి గట్టిగా వారం రోజులు కూడా లేని సందర్భంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటే.. కేసీఆర్ కూడా ప్రచారానికి వెళ్లబోరని టీఆర్ఎస్ వర్గాలు అంచనాకు వచ్చేశాయి. ఇప్పటికే రెండు, మూడు నెలలుగా హరీష్ రావు హుజురాబాద్‌లోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు.

తన రాజకీయ టాలెంట్‌ను అంతా ప్రదర్శించి టీఆర్ఎస్‌ను గట్టెక్కించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆయితే ఆయనకు అగ్రనాయకత్వం నుంచి అందుతున్న సహకారం అంతంతమాత్రంగానే ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ కూడా హరీష్ నేతృత్వంలో పని చేస్తున్నారు కానీ.. అదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కేటీఆర్ మాత్రం కనీసం ప్రచారానికి కూడా వెళ్లబోనని చెబుతున్నారు. దీంతో అక్కడ ఫ లితం తారుమారైతే మొత్తం హరీష్ రావు మెడకు చుట్టేస్తారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది.

దానికి తగ్గట్లుగానే కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఒక వేళ గెలిస్తే ఇప్పుడు కేటీఆర్ చెబుతున్నట్లుగా అది చాలా చిన్న ఎన్నిక అని క్రెడిట్ తక్కువలో తక్కువగా హరీష్ కు ఇచ్చి మిగతా అంతా కేసీఆర్ పాలనకు కట్టబెట్టేస్తారని అంటున్నారు. మొత్తానికి హుజురాబాద్ రాజకీయం నేరుగా ఈటలపైనే కాకుండా సొంత పార్టీ నేతలపైనా టీఆర్ఎస్ హైకమాండ్ ప్రయోగిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్ ఫ్యాన్‌పై రాజద్రోహం, యుద్ధం కేసులు … బెయిలిచ్చిన కోర్టు!

ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వామిభక్తిలో ఎవరూ అందుకోనంత స్థాయికి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని జనసేన సానుభూతి పరుడైన ఓ యువకుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పెట్టిన సెక్షన్లు చూసి న్యాయమూర్తే...

తెరపైకి మళ్లీ దళిత బంధు !

హుజురాబాద్ ఎన్నికలు అయిపోయిన రెండున్నర నెలల తర్వాత దళిత బంధు పథకం విషయంలో కేసీఆర్ మరో ప్రకటన చేశారు. నిజానికి గత డిసెంబర్‌లోపే హుజురాబాద్‌తో పాటు నాలుగు దిక్కులా ఉన్నా నాలుగు మండలాల్లో...

“బండి”కి న్యాయం.. నాకు అన్యాయమా ?: రఘురామా

బండి సంజయ్‌పై పోలీసుల దాడిని లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సీరియస్‌గా తీసుకుంది. ఆ ఘటనకు కారణమైన వారందర్నీ పిలిపించి ప్రశ్నించబోతోంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ విషయం తెలంగాణలో హాట్ టాపిక్...

గుడివాడ కేసినో ఆధారాలు రిలీజ్ చేసిన టీడీపీ !

గుడివాడలో కేసినో నిర్వహించామని నిర్వహిస్తే అక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించుకుంటానని మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. అయితే కేసినో నిర్వహించారన్నదానికి అన్ని ఆధారాలూ సమర్పిస్తామని టీడీపీ చెబుతోంది. ముందుగా కేసినో నిర్వాహకులు.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close