బాలకృష్ణ సినిమా అంటే తమన్‌కి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. స్పీకర్లు బద్దలయ్యే మ్యూజిక్ ఇవ్వడంపైనే ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ కోసం కూడా అదే పనిలో ఉన్నాడు. సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యం ఉన్న పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులతో పాటు సర్వేపల్లి సిస్టర్స్‌ను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో భాగం చేశాడు.
ఇప్పుడు పాటల వంతు వచ్చింది. తొలి పాట ‘తాండవం’ ప్రోమో వదిలారు. థియేటర్స్‌లో పూనకాలు తెప్పించే పాటది. ప్రోమోలో బాలయ్య చేసిన తాండవం అఖండ ఫ్యాన్స్‌ని అలరించింది. పూర్తి పాట 14న రిలీజ్ చేస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రిలీజ్ టైం దగ్గరపడటంతో ఇప్పుడు టీం ప్రమోషన్స్‌కి సిద్ధమవుతోంది. అఖండకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.