అఖిల్‌, బ‌న్నీ… కొత్త‌మ్మాయిల వేట‌!

ఒక‌ప్పుడైతే తెలుగు చిత్ర‌సీమ‌లో క‌థానాయిక‌ల కొర‌త బాగానే క‌నిపించేది. ఇప్పుడు ఆ లోటు కాస్త తీరింది. కొత్త‌మ్మాయిలు త‌ఢాకా చూపించ‌డం, నిల‌దొక్కుకోవ‌డం, బ‌డా హీరోయిన్లు ఫామ్ కొన‌సాగించ‌డంతో కొంత కాలంగా క‌థానాయిక‌ల స‌మ‌స్య పెద్ద‌గా త‌లెత్త‌లేదు. అయితే.. ఈ సీజ‌న్‌లో మాత్రం హీరోయిన్ల‌తో కాస్త పేచీ వ‌స్తోంది. సీనియ‌ర్లు, జూనియ‌ర్లు ఎవ‌రి సినిమాల‌తో వాళ్లు బిజీగా ఉండ‌డంతో కాల్షీట్ల స‌మ‌స్య త‌లెత్తుతోంది. దీనికి తోడు ‘కొత్త కాంబినేష‌న్లు’ చూపించాల‌ని ద‌ర్శ‌కులు త‌హ‌త‌హ‌లాడుతుండ‌డంతో న‌యా భామ‌ల వేట మ‌రోసారి మొద‌లైంది. అఖిల్ రెండో సినిమాలో క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది ఇంత వ‌ర‌కూ తేల‌లేదు. అఖిల్ ప‌క్క‌న కొత్త‌మ్మాయే క‌నిపిస్తుంద‌ని నాగ్ ఎప్పుడో చెప్పేశాడు. కొంత‌మంది అమ్మాయిల్ని అడిష‌న్స్ కూడా చేసేశారు. కానీ.. ఫైనల్ రిజల్ట్ ఏంట‌న్న‌ది తేల‌లేదు.

మ‌రోవైపు అల్లు అర్జున్ కోస‌మూ క‌థానాయిక వేట మొద‌లైంది. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం డీజే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ వెంట‌నే… వ‌క్కంతం వంశీ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తారు. ఈనెల 21న ఈ సినిమా షూటింగ్ లాంఛ‌నంగా ప్రారంభం కానున్న‌ద‌ని తెలుస్తోంది. ఈ లోగా క‌థానాయిక‌ని ఎంచుకొనే ప‌నిలో ప‌డింది చిత్ర‌బృందం. ఈసారి బ‌న్నీ ప‌క్క‌న కొత్త‌మ్మాయే క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల గీతా ఆర్ట్స్‌లో.. కొంత‌మంది అమ్మాయిల్ని అడిష‌న్స్ చేశార్ట‌. వాళ్ల‌లో ఒక‌ర్ని ఎంపిక చేయ‌డం ఖాయ‌మ‌ని స‌మాచారం. సో… ఈ రెండు క్రేజీ సినిమాల్లోనూ కొత్త‌మ్మాయిలే క‌నిపిస్తారన్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పార్టీ వేరు.. ప్రభుత్వం వేరంటున్న ఆర్ఆర్ఆర్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో విందు భేటీ నిర్వహించారు. ఆయన రాజకీయం కొద్ది రోజులుగా బీజేపీ చుట్టూనే తిరుగుతోంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా.. పొగుడుతూ...

“ఉస్మానియా” పాపం ప్రతిపక్షాలదేనా..?

ఉస్మానియా ఆస్పత్రి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారింది. బుధవారం పడిన వర్షానికి ఉస్మానియా మొత్తం నీళ్లు నిండిపోవడం.. చికిత్స గదుల్లో కూడా నీరు చేరడంతో.. విపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఐదేళ్ల...

సంతోష్ కుమార్ చాలెంజ్ అంటే స్వీకరించాల్సిందే..!

కొద్ది రోజులుగా మీడియాలో.. సోషల్ మీడియాలో ఓ వార్త రెగ్యులర్‌గా కనిపిస్తోంది. అదే.. ప్రభాస్.. బ్రహ్మానందం.. సమంత లాంటి స్టార్లు.. మొక్కలు నాటుతూ.. చాలెంజ్‌ను కంప్లీట్ చేయడం.. ఆ చాలెంజ్‌ను మరికొంత...

కరోనా రాని వాళ్లెవరూ ఉండరు : జగన్

భవిష్యత్‌లో కరోనా వైరస్ సోకని వాళ్లు ఎవరూ ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని.. ఎవరూ వాటిని ఆపలేరని వ్యాఖ్యానించారు. కరోనా ఆపడానికి...

HOT NEWS

[X] Close
[X] Close