బుల్లెట్ వ‌స్తుందా?? రాదా??

గోపీచంద్ న‌టించిన ఆర‌డుగుల బుల్లెట్ ఈనెల 9న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ఆర్థిక ప‌ర‌మైన స‌మ‌స్య‌ల్లో చిక్కుకొందిప్పుడు. విడుద‌ల‌కు ముందు ఫైనాన్సియ‌ర్లు రివ‌ర్స్ అవ్వ‌డంతో… బుల్లెట్ వ‌స్తుందా, రాదా?? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. స‌హ‌దేవ్ అనే ఫైనాన్సియ‌ర్ ఆర‌డుగులు బుల్లెట్ నిర్మాత తాండ్ర ర‌మేష్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న వ‌ద్ద రూ.6 కోట్లు అప్పుగా తీసుకొన్నార‌ని, సినిమా విడుద‌ల‌కు ముందు సెటిల్ చేస్తాన‌ని చెప్పార‌ని, అయితే.. అదేం చేయ‌కుండా ఇప్పుడు సినిమా విడుద‌ల చేసేస్తున్నార‌ని, త‌న డ‌బ్బులు సెటిల్ చేస్తేగానీ సినిమాని విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని స‌హ‌దేవ్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో వ్య‌వ‌హారం పీవీపీ సంస్థ‌కు చుట్టుకొంది. ఎందుకంటే ఈ సంస్థే ఆర‌డుగులు బుల్లెట్ సినిమాకి టేకొవ‌ర్ చేసింది. ‘మా బాకీలు కూడా మ‌రే చెల్లించండి’ అంటూ ప్ర‌సాద్ పొట్లూరిపై ఒత్తిడి పెంచుతున్నారు అప్పుల వాళ్లు. స‌హ‌దేవ్‌ని చూసి మ‌రో ఇద్ద‌రు ముగ్గురు ఫైనాన్సియ‌ర్లు తాండ్ర ర‌మేష్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకొన్నార‌ని తెలుస్తోంది. వాళ్లంతా క‌ల‌సి ‘ఆర‌డుగుల బుల్లెట్‌’ విడుద‌ల ఆపేస్తారా?? లేదంటే.. ఈ వ్య‌వ‌హారాన్ని పీవీపీ సెటిల్ చేసేస్తుందా?? చూడాలి. ఏం జ‌రిగినా.. రేపు ఉద‌యం క‌ల్లా.. క్లియ‌రెన్స్ తెచ్చుకోవాలి. అందుకోసం తాండ్ర ర‌మేష్ ఆప‌సోపాలు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పార్టీ వేరు.. ప్రభుత్వం వేరంటున్న ఆర్ఆర్ఆర్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో విందు భేటీ నిర్వహించారు. ఆయన రాజకీయం కొద్ది రోజులుగా బీజేపీ చుట్టూనే తిరుగుతోంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా.. పొగుడుతూ...

“ఉస్మానియా” పాపం ప్రతిపక్షాలదేనా..?

ఉస్మానియా ఆస్పత్రి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారింది. బుధవారం పడిన వర్షానికి ఉస్మానియా మొత్తం నీళ్లు నిండిపోవడం.. చికిత్స గదుల్లో కూడా నీరు చేరడంతో.. విపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఐదేళ్ల...

సంతోష్ కుమార్ చాలెంజ్ అంటే స్వీకరించాల్సిందే..!

కొద్ది రోజులుగా మీడియాలో.. సోషల్ మీడియాలో ఓ వార్త రెగ్యులర్‌గా కనిపిస్తోంది. అదే.. ప్రభాస్.. బ్రహ్మానందం.. సమంత లాంటి స్టార్లు.. మొక్కలు నాటుతూ.. చాలెంజ్‌ను కంప్లీట్ చేయడం.. ఆ చాలెంజ్‌ను మరికొంత...

కరోనా రాని వాళ్లెవరూ ఉండరు : జగన్

భవిష్యత్‌లో కరోనా వైరస్ సోకని వాళ్లు ఎవరూ ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని.. ఎవరూ వాటిని ఆపలేరని వ్యాఖ్యానించారు. కరోనా ఆపడానికి...

HOT NEWS

[X] Close
[X] Close