అఖిల్ సినిమాకి క్లాప్ కొట్టేశారోచ్‌!

అఖిల్ రెండో సినిమా ప‌ట్టాలెక్కింది. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆదివారం సాయంత‌రం 6 గంట‌ల‌ 17 నిమిషాల శుభ ముహూర్తాన అక్కినేని కుటుంభ సభ్యుల సమక్షంలో ఈ చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. అక్కినేని ముని మనవరాళ్ళు సత్య సాగరి దేవుని ప‌టాల‌పై క్లాప్ ని ఇవ్వగా , దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ, ” ‘మనం’ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మరో ట్రెండ్ సెట్టర్ అవుతుంది.” ఏప్రిల్ 3 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందన్నారు.

విక్రమ్ కె కుమార్ చెబుతూ ” అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ‘మనం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్ళీ అదే బ్యానర్ లో ఒక మంచి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అఖిల్ కి ఇది ఒక డిఫరెంట్ కమర్షియల్ ఫిలిం అవుతుంది ” అన్నారు ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : పి.ఎస్. వినోద్, ఆర్ట్ : రాజీవన్ , ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, నిర్మాత : అక్కినేని నాగార్జున, రచన, దర్శకత్వం : విక్రమ్ కె కుమార్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close