క్రిష్ సినిమా : మ‌ణిక‌ర్ణిక‌ ఖాయం

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి త‌ర‌వాత క్రిష్ సినిమా ఏంట‌న్న విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం ఆయ‌న బాలీవుడ్‌లో `మ‌ణిక‌ర్ణిక‌` అనే ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కే చిత్ర‌మిది. కంగ‌నార‌నౌత్ టైటిల్ పాత్ర‌ని పోషించ‌బోతోంది. ఈ చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ని అందించారు. హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ ఈ చిత్రాన్ని రూపొందించే అవ‌కాశాలున్నాయి. ప్ర‌స్తుతం క్రిష్ ముంబైలో ఉన్నారు. అక్క‌డ నిర్మాణ సంస్థ‌తో ఆయ‌న సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. ఇప్ప‌టికే పూర్తి స్థాయిలో స్క్రిప్టు సిద్ధ‌మైంది. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది.

క్రిష్ నుంచి వ‌చ్చిన కంచె, గౌత‌మిపుత్ర‌.. రెండూ యుద్ధం నేప‌థ్యంలో రూపొందిన క‌థ‌లే. త‌క్కువ బ‌డ్జెట్‌లోనే వార్ ఎపిసోడ్స్‌ని చాలా తెలివిగా ప్ర‌భావ‌వంతంగా తీర్చిదిద్దాడు క్రిష్‌. ఆ నైపుణ్య‌మే బాలీవుడ్‌లో సినిమా అవ‌కాశాన్ని తెచ్చి పెట్టింది. దాదాపుగా రూ.100 కోట్ల బ‌డ్జెట్ ఈ సినిమా కోసం కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసుకొనే ప‌నిలో ఉన్నారు క్రిష్‌. తెలుగు నుంచీ కొంత‌మంది న‌టీన‌టుల‌కు ఛాన్స్ అందే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

వార‌సుడిపై దృష్టి పెట్టిన బాల‌య్య‌

లాక్ డౌన్ లో స్టార్లంతా ఇంటికే ప‌రిమితం అయ్యారు. వివిధ ర‌కాల వ్యాపాల‌తో బిజీగా మారారు. బాల‌కృష్ణ కూడా అంతే. అయితే ఈ విరామాన్ని ఆయ‌న త‌న వార‌సుడి కోసం కేటాయించారు. మోక్ష‌జ్ఞ...

క‌థ‌ల కోసం యూవీ అన్వేష‌ణ‌

యూవీ క్రియేష‌న్స్ పేరు చెప్ప‌గానే సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే ప్ర‌స్తుతం యూవీ చిన్న సినిమాల‌వైపు దృష్టి పెట్టింది. ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాల్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉంది....

చుండూరు దళితుల ఊచకోతకు 29 ఏళ్లు..! న్యాయం ఎప్పటికి..?

అది ఓ పచ్చని పల్లె. కానీ ఓ రోజు అక్కడి పంట కాలవల గోతాల్లో శవాలు బయటపడ్డాయి. ముక్కలు ముక్కలుగా నరికి గోతాల్లో కుక్కి అక్కడ పడేశారు. అందరూ దళితులు. మొత్తంగా ఎనిమిదిని...

HOT NEWS

[X] Close
[X] Close