అఖిల్ – సురేంద‌ర్ రెడ్డి ఫిక్స్

`సైరా` త‌ర‌వాత సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్టు ఎవ‌రితో అన్న విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. అగ్ర హీరోలంతా బిజీ బిజీగా ఉండ‌డంతో.. సురేంద‌ర్ రెడ్డికి అనుకోని విరామం తీసుకోవాల్సివ‌చ్చింది. కొంత‌మంది కోసం క‌థ‌లు సిద్ధం చేసినా, సెట్ అవ్వ‌లేదు. చివ‌రికి అఖిల్ తో సూరి ప్రాజెక్టు ఫిక్స్ అయ్యింది. గ‌త కొన్ని రోజులుగా సురేంద‌ర్ రెడ్డి – అఖిల్ కాంబో గురించి వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా దాదాపుగా ఖాయం అయిపోయింది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే అవ‌కాశాలున్నాయి. ప్ర‌స్తుతం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్నాడు అఖిల్‌. చిత్రీక‌ర‌ణ చివ‌రికి వచ్చింది. లాక్ డౌన్ నిబంధ‌న‌ల్ని పూర్తిగా ఎత్తేసి, థియేట‌ర్ల‌కు అనుమ‌తులు వ‌స్తే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని గీతా ఆర్ట్స్ ఎదురు చూస్తోంది. త్వ‌ర‌లోనే సూరి – అఖిల్ కాంబోపై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెంకయ్యనాయుడికి కరోనా ..!

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. అతి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. దాంతో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్‌లోనే వెంకయ్యనాయుడు ఉన్నారు. లక్షణాలు పెరిగితే...

‘ఆదిపురుష్`’పై అనుష్క క్లారిటీ

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో బ‌హుళ భాషా చిత్రం `ఆది పురుష్‌`. రావ‌ణుడి పాత్ర‌కు సైఫ్ అలీఖాన్‌ని ఎంచుకున్నారు. సీత పాత్ర కోసం చాలామంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అందులో అనుష్క పేరు...

గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా?...

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

HOT NEWS

[X] Close
[X] Close