చిరు మాస్టర్ ప్లాన్

ఆచార్య త‌ర‌వాత‌.. భారీ లైన‌ప్ అట్టి పెట్టుకున్నాడు చిరంజీవి. ఓ వైపు బాబీకి ఓకే చెప్పిన చిరు, మ‌రోవైపు మెహ‌ర్ ర‌మేష్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇంకోవైపు వినాయ‌క్ తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు.  ఆచార్య నుంచి.. వినాయ‌క్ వ‌ర‌కూ వెళ్లాలంటే.. క‌నీసం రెండు మూడేళ్లు ప‌ట్టాలి. కానీ.. చిరు మాస్ట‌ర్ ప్లాన్ వేరుగా ఉంది. ఆచార్య త‌ర‌వాత‌.. ఒకేసారి రెండు ప్రాజెక్టుల్ని ప‌ట్టాలెక్కించాల‌న్న‌ది చిరు ప్లాన్‌. ఆచార్య ముగిసిన వెంట‌నే.. మెహ‌ర్ ర‌మేష్ `వేదాళం` రీమేక్ ప‌ట్టాలెక్కుతుంది. `వేదాళం` మొద‌లైన నెల‌రోజుకే.. బాబీ సినిమానీ మొద‌లెట్టాల‌న్న‌ది చిరు ప్లాన్‌. ఆగ‌స్టు 22న చిరు పుట్టిన రోజు సంద‌ర్భంగా మెహ‌ర్ ర‌మేష్ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. నిజానికి బాబీ సినిమానే చిరు ముందుగా మొద‌లెట్టాలి. అయితే.. మెహ‌ర్ ర‌మేష్ `వేదాళం` స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్ధం చేసేసిన‌ట్టు స‌మాచారం. బాబీ క‌థ స్క్రిప్టు రూపంలో మార‌డానికి ఇంకొంచెం స‌మ‌యం ఉంద‌ని తెలుస్తోంది. అందుకే ముందుగా వేదాళం మొద‌లెట్టి, ఆ త‌ర‌వాత‌.. బాబీ సినిమానీ ప‌ట్టాలెక్కించాల‌ని భావిస్తున్నాడు చిరు. మెగాస్టార్ అయ్యాక‌.. ఒకేసారి స‌మాంత‌రంగా రెండు సినిమాల్ని న‌డిపించ‌లేదు చిరు. అయితే ఇప్పుడు ఆ అవ‌స‌రం, అవ‌కాశం వ‌చ్చాయి. కాబ‌ట్టి ఈ రేర్ ఫీట్ కి చిరు సిద్ధ‌మైన‌ట్టు టాక్‌. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close