అదే సైకిల్- అప్పుడు అల్లుడికి, ఇప్పుడు త‌న‌యుడికి

ఏపీలో, యూపీలో అదే సీన్. 1995లో అధికార తెలుగు దేశం పార్టీలో రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డింది. మామ ఎన్టీఆర్ ఒక వైపు, అల్లుడు చంద్ర‌బాబు నాయుడు మ‌రోవైపు సైకిల్ గుర్తు కోసం పోరాడారు. చివ‌ర‌కు అల్లుడికే సైకిల్ గుర్తు ద‌క్కింది. అది ఆంధ్ర ప్ర‌దేశ్ లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామం.

ఇప్పుడు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో అధికార స‌మాజ్ వాదీ పార్టీలోనూ రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డింది. తండ్రి ములాయం సింగ్ యాద‌వ్, త‌న‌యుడు అఖిలేష్ యాద‌వ్ లు సైకిల్ గుర్తుకోసం పోరాడారు. చివ‌ర‌కు త‌న‌యుడికే సైకిల్ ద‌క్కింది.

ఏపీలో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు. ఆయ‌న పార్టీ పెట్టే స‌మ‌యానికి చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ లో ఉన్నారు. యూపీలో స‌మాజ్ వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్. ఆయ‌న పార్టీ పెట్టే నాటికి అఖిలేష్ స్కూల్లో విద్యార్థిగా ఉన్నాడు.

ఇర‌వై ఏళ్ల నాడు తెలుగు దేశంలో ముస‌లం పుట్టిన స‌మ‌యంలో జ‌య‌ప్ర‌ద చంద్ర‌బాబు వైపు ఉన్నారు. ఇప్పుడు యూపీలో అలాంటి ముస‌లం పుట్టిన‌ప్పుడు ఆమె రాజ‌కీయ గురువు అమ‌ర్ సింగ్ తో పాటు ములాయం వైపు ఉన్నారు. అదే విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విశాఖలో విపక్షాలు ఊహించని రేంజ్‌లో విజయసాయి రాజకీయం..!

విశాఖలో వైసీపీని గెలిపించే బాధ్యతను భుజానకు ఎత్తుకున్న విజయసాయిరెడ్డి అక్కడ చేస్తున్న రాజకీయం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ప్రజలు ఓట్లు వేస్తే వైసీపీ అభ్యర్థులు గెలుస్తారో లేదోనన్న సందేహం గట్టిగా ఉందేమో...

అఫీషియ‌ల్‌: సంక్రాంతి బ‌రిలో ప‌వ‌న్

ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఏఎం ర‌త్నం నిర్మాత‌. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌. ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుద‌ల కానుంద‌ని ముందు నుంచీ...

హైదరాబాద్‌లో ఐపీఎల్ కోసం కేటీఆర్ బ్యాటింగ్..!

సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు లేరని... ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన ఆటగాళ్లు ఎవరూ లేరని అందరూ విమర్శలు చేస్తూంటే... మంత్రి కేటీఆర్ మాత్రం.....

హిందీ ‘ఛ‌త్ర‌ప‌తి’.. హీరోయిన్ ఫిక్స్‌

రాజ‌మౌళి - ప్ర‌భాస్‌ల ఛ‌త్ర‌ప‌తిని ఇన్నేళ్ల త‌ర‌వాత బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరో. ఈ సినిమాతోనే హిందీలో అడుగుపెడుతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. త‌న‌కీ ఇదే...

HOT NEWS

[X] Close
[X] Close