అర్జున్‌తో నితిన్ ఫైటింగ్‌

హీరోలు విల‌న్లుగా ట‌ర్న్ అవుతున్న ట్రెండ్ ఇది. ఆల్రెడీ జ‌గ‌ప‌తిబాబు విల‌న్ గా విజృంభించేస్తున్నాడు. ఇప్పుడాయ‌న స్నేహితుడు అర్జున్ కూడా నెగిటీవ్ పాత్ర‌ల‌వైపు ట‌ర్న్ అవుతున్నాడు. నితిన్ క‌థానాయ‌కుడిగా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్ సంస్థ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. హ‌ను రాఘవపూడి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రంలో అర్జున్‌ని ప్ర‌తినాయ‌కుడి పాత్ర ద‌క్కింది. ఈమ‌ధ్య కాలంలో ఇలాంటి క‌థ‌, పాత్ర ఎవ్వ‌రూ త‌న ద‌గ్గ‌ర‌కు తీసుకురాలేద‌ని, అందుకే ఈ సినిమా ఒప్పుకొన్నాన‌ని అర్జున్ అంటున్నాడు. అస‌లు ఈ పాత్ర లో అర్జున్‌ని త‌ప్ప ఎవ్వ‌రికీ ఊహించుకోలేద‌ని, క‌థ చెప్ప‌గానే అర్జున్ ఒప్పుకోవ‌డం చాలా సంతోషాన్ని ఇచ్చింద‌ని, అర్జున్ ఓకే అన్న‌ప్పుడు వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన సంద‌ర్భంలో స‌చిన్ టెండూల్క‌ర్ ఎంత సంబ‌ర ప‌డ్డాడో.. తాను కూడా అంత‌గా ఆనందించాన‌ని ద‌ర్శ‌కుడు హ‌ను చెబుతున్నాడు.

”ఈ సినిమాలో లోని స్పెషల్‌ క్యారెక్టర్‌ ఎవరు చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఫస్ట్‌ స్ట్రైక్‌ అయింది అర్జున్‌గారు. దానికి ఓ కారణం వుంది. నేను చిన్నతనం నుంచి యాక్షన్‌ మూవీస్‌ బాగా చూసేవాడిని. తెలుగులో రిలీజ్‌ అయిన అర్జున్‌గారి సినిమాలన్నీ నేను చూశాను. ఆ సినిమాలన్నీ స్టోరీతో సహా ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఈ సినిమాలో అర్జున్‌గారు విలన్‌గా చేస్తున్నారు. ఆయనది చాలా స్పెషల్‌ క్యారెక్టర్‌. ఆయనతోనే స్టార్ట్‌ అయ్యే కథ. ఇది ఒక టెర్రిఫిక్‌ రోల్‌. అర్జున్‌గారు తప్ప ఈ క్యారెక్టర్‌ని ఎవరూ చెయ్యలేరు అనిపించేలా వుంటుంది. ఈ క్యారెక్టర్‌ గురించి అర్జున్‌గారికి ఎలా చెప్పాలి అని చాలా స్ట్రగుల్‌ అయ్యాం. ఒక ఫైన్‌ డే ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడాను. జనవరి 4న కలిసి క్యారెక్టర్‌ గురించి చెప్పాను. ఆయన ఈ క్యారెక్టర్‌ చేస్తానని చెప్పగానే సచిన్‌ టెండూల్కర్‌ వరల్డ్‌ కప్‌ గెలిచినపుడు ఎంత ఆనందపడ్డాడో నేనూ అంత హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఆరోజు నాకు చాలా స్పెషల్‌. ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నందుకు అర్జున్‌గారికి థాంక్స్‌ చెప్తున్నా” అని సంబ‌ర‌ప‌డిపోతున్నాడు హ‌ను రాఘ‌వ‌పూడి. అయితే ఈ సినిమా కోసం అర్జున్‌కి భారీ పారితోషికం ముట్టిన‌ట్టు తెలుస్తోంది. అర్జున్ పారితోషికం దాదాపుగా కోటి రూపాయ‌లు ఉంటుంద‌ని, టెమ్టింగ్ రెమ్యునరేషన్ కూడా అర్జున్ ఈ సినిమా ఒప్పుకోవ‌డానికి ఓ కార‌ణ‌మ‌ని చిత్ర‌సీమ‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com