అఖిలేష్ యాదవ్ వెనక్కి తగ్గారు కానీ…

యూపిలో అధికార సమాజ్ వాది ప్రభుత్వంలో రాజుకొన్న చిచ్చుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ ఆర్పివేసినట్లే ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన మంత్రివర్గ విస్తరణ చేశారు. దానిలో ముగ్గురు కొత్త మంత్రులతో సహా గాయత్రి ప్రజాప్రతికి కూడా చోటు దక్కింది.

విశేషమేమిటంటే, గాయత్రి ప్రజాప్రతిపై అవినీతి ఆరోపణలు రుజువు అవడంతో అఖిలేష్ యాదవ్ స్వయంగా ఆయనని కొన్ని రోజుల క్రితమే మంత్రి పదవిలో నుంచి తొలగించారు. తద్వారా తను అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సహించబోనని, తన ప్రభుత్వం చాలా పారదర్శకంగా, నీతివంతంగా పరిపాలన చేస్తోందని రుజువు చేసుకొనేందుకు అఖిలేష్ యాదవ్ ప్రయత్నించారు. కానీ మళ్ళీ ఇప్పుడు తను తొలగించిన ఆ అవినీతిపరుడినే మంత్రివర్గంలోకి తీసుకోవలసిరావడంతో ప్రజలకి, ముఖ్యంగా ప్రతిపక్షాలకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు.

గాయత్రి ప్రజాప్రతిని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకొనేలా చేసి ములాయం సింగ్ యాదవ్ పార్టీపై, కొడుకు ప్రభుత్వంపై తన ఆధిపత్యం నిరూపించుకోగలిగారు. పైగా పార్టీకి అధ్యక్షుడుగా తన తమ్ముడు శివపాల్ యాదవ్ ని నియమించడంతో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య పెద్ద అడ్డుగీత కూడా గీసినట్లయింది. ఆ కారణంగా పార్టీకి, ప్రభుత్వానికి మద్య సమన్వయం కొరవడి దేని దారి దానిదేనన్నట్లుగా సాగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇటువంటి పరిణామాలు వలన తన కొడుకుకి, పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు ఏర్పడుతుందని పెద్దాయన (ములాయం సింగ్ యాదవ్) గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : ఓనర్లు కాదు.. వాళ్లే టీవీ5ని అమ్మేశారు..!

ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్...

సాగర్‌కు ఓకే కానీ సీమకు కృష్ణా నీళ్లు పంపొద్దంటున్న తెలంగాణ..!

శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది....

టీ బీజేపీ నుంచి పోయేవాళ్లను ఎవరూ ఆపడం లేదేంటి..!?

తెలంగాణ బీజేపీకి వలసల ఫీవర్ పట్టుకుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ అంచనాలు రావడంతో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీ బాట పట్టారు....

మండలి రద్దు తీర్మానాన్ని ఇంకా పరిశీలిస్తున్నారట..!

శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని.. కేంద్ర మంత్రి రిజుజు రాజ్యసభలో తెలిపారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. లిఖితపూర్వక సమాధానం...

HOT NEWS

[X] Close
[X] Close