అక్కినేని ఫ్యామిలీ రికార్డ్!

హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ ఇవాళ రికార్డ్ సృష్టిస్తోంది. ఫ్యామిలీలోని ముగ్గురు హీరోలూ – నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ – ప్రస్తుతం నటిస్తున్న వారి వారి తాజా చిత్రాల ప్రోమోలు మూడూ ఇవాళ రిలీజ్ అవుతున్నాయి. తండ్రి, ఇద్దరు కొడుకుల చిత్రాల ప్రోమోలు ఇలా ఒకే రోజు రిలీజ్ అవ్వటం భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్ అని చెప్పుకోవాలి. నూతన దర్శకుడు కళ్యాణకృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయన’, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’, వినాయక దర్శకత్వంలో నితిన్ నిర్మిస్తున్న ‘అఖిల్’ ప్రోమోలు ఇవాళ విడుదలవుతున్నాయి.

ఇంతకన్నా మంచి బర్త్‌డే ట్రీట్ తనకు మరేమీ లేదని నాగార్జున అంటున్నారు. ప్రస్తుతం ఆయన ఫారెన్‌లో ఉన్నారు. వరస చిత్రాలతో బిజీగా ఉన్నట్లు చెప్పారు. సోగ్గాడే చిన్ని నాయన సెప్టెంబర్ 20కి, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమా అక్టోబర్‌కు పూర్తవుతాయని తెలిపారు. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక భక్తి సినిమా, ఈ లోపుగా ఒక యాక్షన్ సినిమా చేస్తానని చెప్పారు. మరో రెండు నెలల్లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొత్త సీజన్ ప్రారంభమవుతుందని, ఇవి కాకుండా ఒక పౌరాణికం, జేమ్స్‌బాండ్ తరహాలో ఒక యాక్షన్ సినిమా చేయాలనుందని చెప్పారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా అంతా కొత్తవారితో ఒక సినిమా నిర్మిస్తున్నట్లు, సైజ్ జీరో చిత్రంలో గెస్ట్ రోల్ చేయనున్నట్లు నాగ్ వెల్లడించారు. మరోవైపు అఖిల్ చిత్రం టీజర్‌ను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇవాళ సాయంత్రం రిలీజ్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close