‘అల…’ టీజ‌ర్‌… చెక్కుతూనే ఉన్నారు..

ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచిన సినిమా ‘అల.. వైకుంఠ‌పుర‌ములో’. ముందు నుంచీ ప్ర‌మోష‌న్స్ పీక్స్‌లో జ‌రుగుతున్నాయి. సినిమా విడుద‌ల‌కు మ‌రో నెల రోజులే స‌మ‌యం ఉంది. ఇప్పుడు టీజ‌ర్‌ని విడుద‌ల చేస్తున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖ‌రారైపోయింది.

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’కీ ‘అల వైకుంఠ‌పుర‌ములో’కీ గ‌ట్టి పోటీ మొద‌లైంది. రెండు సినిమాలూ నువ్వా? నేనా? అనే రేంజులో ప్ర‌మోష‌న్లు చేస్తున్నాయి. `స‌రి లేరు..` టీజ‌ర్ రాక‌ముందు బ‌న్నీ సినిమాదే పై చేయి. ‘స‌రిలేరు..’ టీజ‌ర్‌తో ప‌రిస్థితి మారింది. ఒక్క టీజ‌ర్‌తో.. మ‌హేష్ సినిమా ముందుకు దూసుకెళ్లిపోయింది. టీజ‌ర్‌ని క‌ట్ చేసిన విధానం, అందులో చూపించిన కంటెంట్ అంద‌రికీ బాగా న‌చ్చింది. అది టీజ‌ర్‌లా లేదు. ట్రైల‌రే అనుకోవాలి.

ఆ ఒత్తిడి `అల వైకుంఠ‌పుర‌ములో`పై పడింది. ఈ టీజ‌ర్ ఎప్పుడో రావాల్సింది. కానీ.. టీజ‌ర్ కూడా అనేక వెర్ష‌న్లు క‌ట్ చేసీ చేసీ చివ‌రికి ఒక‌టి ఫిక్స్ చేశారు. ఇప్ప‌టికి కూడా టీజ‌ర్‌ని చెక్కుతూనే ఉన్నారు. ఫైన‌ల్ వెర్ష‌న్ ప‌నులు ఇంకా జ‌రుగుతూనేఉన్నాయి. కంటెంట్ చెప్ప‌డంతో పాటు, త్రివిక్ర‌మ్ మార్క్ ఛ‌మ‌క్ ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. మ‌రి వైకుంఠ‌పురం టీజ‌ర్ ఎలా ఉందో తెలియాలంటే ఇంకొన్ని గంట‌లు ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేటీఆర్..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచన టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలతో...

బ్లడ్ క్యాంప్‌ కోసం పిలుపిస్తే నారా రోహితే లీడరనేస్తున్నారు..!

తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎవరైనా నాయకుడు కనిపిస్తాడా అని చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎలా ఉన్నాయంటే.. చివరికి పార్టీ ఆఫీసులో తలసేమియా బాధితుల కోసం ఓ...

బీజేపీకీ ఈవీఎం ఎన్నికలే కావాలట..!

భారతీయ జనతాపార్టీ ఈవీఎంలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. కరోనా కాలంలో ఒకే ఈవిఎం బటన్‌ను అందరూ అదే పనిగా నొక్కితే కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆందోళనలు వినిపిస్తున్న సమయంలో......

HOT NEWS

[X] Close
[X] Close