‘పింక్‌’లో స‌మంత‌?

‘పింక్’ రీమేక్ కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. తాప్సి పాత్ర కోసం పూజా హెగ్డేని ఓ ఆప్ష‌న్‌గా అనుకుంటున్నారు. అయితే… ఇప్పుడు దిల్‌రాజు దృష్టి స‌మంత‌పై ప‌డింది. పూజా కంటే స‌మంత ఉంటే… ఈ పాత్ర‌కు మ‌రింత నిండుద‌నం వ‌స్తుంద‌ని దిల్‌రాజు భావిస్తున్నాడు. అందుకే స‌మంత‌తో సంప్ర‌దింపులు మొద‌లెట్టాడు. ప‌వ‌న్ – దిల్‌రాజు కాంబోలో వ‌స్తున్న ఈ సినిమా త‌ప్ప‌కుండా క్రేజీ ప్రాజెక్టే. కాక‌పోతే – రీమేక్‌లు చేయ‌డం అంటే స‌మంత‌కు అంత‌గా ఇష్టం ఉండ‌దు. ఆ ఒక్క కార‌ణం మిన‌హాయిస్తే ‘నో’ చెప్పే అవ‌కాశ‌మే లేదు. స‌మంత నిర్ణ‌యం కోసం ఇప్పుడు ‘పింక్’ టీమ్ ఎదురు చూస్తోంది. ఓ వారం రోజుల్లో ఈ విష‌యంపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com