మళ్లీ మెగా ఫోన్ ప‌ట్టుకోబోతున్న‌ బి.గోపాల్‌

తెలుగు సినిమాకి ఫ్యాక్ష‌న్‌ని ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుల్లో బి.గోపాల్ ఒక‌రు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల నాడీ తెలిసిన వ్య‌క్తి. అగ్ర హీరోలంద‌రితోనూ ప‌నిచేశాడు. బాల‌య్య తో అయితే సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌. అయితే కొంత‌కాలంగా ఆయ‌న తెర వెన‌కే ఉన్నారు. గోపీచంద్‌తో తెర‌కెక్కించిన `ఆర‌డుగుల బుల్లెట్‌` ఆయ‌న‌చివ‌రి చిత్రం. ఆ సినిమా కూడా రిలీజ్ కాకుండా పోయింది.

ఇప్పుడు ఆయ‌న సినిమా వేడుక‌ల్లో కేవ‌లం `అతిథి` పాత్ర‌ల్లోనే ద‌ర్శ‌న మిస్తున్నారు. అయితే… ఇప్పుడు మ‌ళ్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌న్న కోరిక పుట్టింది. అందుకే ఓ క‌థ సిద్ధం చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఈసారి కూడా ఓ పెద్ద హీరోతోనే సినిమా చేయాల‌ని భావిస్తున్నార్ట‌. బి.గోపాల్ కి సుదీర్ఢ‌మైన కెరీర్ ఉంది. ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌నంటే అంద‌రికీ గౌర‌వమే. కానీ.. ఆయ‌న చివ‌రి సినిమా ఆగిపోయింది. చివ‌రి సినిమా కూడా మైలురాయిలానే ఉండాల‌ని బి.గోపాల్ భావిస్తున్నారు. అందుకే.. ఓ మంచి హిట్‌తో కెరీర్ ముగించాల‌ని అనుకుంటున్నారు. అందుకే వెట‌ర‌న్ అయినా కూడా.. మ‌ళ్లీ మెగాఫోన్‌పై దృష్టి సారించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేటీఆర్..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచన టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలతో...

బ్లడ్ క్యాంప్‌ కోసం పిలుపిస్తే నారా రోహితే లీడరనేస్తున్నారు..!

తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎవరైనా నాయకుడు కనిపిస్తాడా అని చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎలా ఉన్నాయంటే.. చివరికి పార్టీ ఆఫీసులో తలసేమియా బాధితుల కోసం ఓ...

బీజేపీకీ ఈవీఎం ఎన్నికలే కావాలట..!

భారతీయ జనతాపార్టీ ఈవీఎంలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. కరోనా కాలంలో ఒకే ఈవిఎం బటన్‌ను అందరూ అదే పనిగా నొక్కితే కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆందోళనలు వినిపిస్తున్న సమయంలో......

HOT NEWS

[X] Close
[X] Close