కోన్ కిస్కా గొట్టం గాళ్లు, మూర్ఖులు.. విమ‌ర్శ‌కుల‌పై అలీ ఫైర్‌

ఎప్పుడూ లేనిది… అలీ రివ్యూవ‌ర్ల‌పై విరుచుకుప‌డిపోయారు. ‘కోన్ కిస్కా గొట్టాం గాళ్లు, మూర్ఖులు..’ అంటూ పెద్ద పెద్ద ప‌దాల‌నే వాడేశారు. ఇదంతా.. `రాజుగారి గ‌ది 3` నెగిటీవ్ రివ్యూల‌పై ఆయ‌న మండిపాటు. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రానికి రేటింగులు దారుణంగా వ‌చ్చాయి. సినిమా కూడా అలానే ఉంద‌నుకోండి. అది వేరే విష‌యం. ఈసినిమాలో అలీ ఓ కీల‌క‌మైన పాత్ర పోషించాడు. తీరా రివ్యూలు ఇలా వ‌చ్చేస‌రికి ఆయ‌న తెగ ఫీలైపోయి.. మైకు ప‌ట్టుకుని త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు.

భ్ర‌మ‌రాంబ ధియేట‌ర్లో తాను ఈ సినిమా చూశాన‌ని, అక్క‌డ ప్రేక్ష‌కులు హాయిగా న‌వ్వుకున్నార‌ని, త‌మ టీమ్‌ని అభినందించార‌ని, ప్రివ్యూ థియేట‌ర్లో అయితే, త‌మ సొమ్ములేవో పోయిన‌ట్టు జ‌నాలు న‌వ్వ‌ర‌ని, అందుకే ఇక మీద‌ట ప్రివ్యూ థియేట‌ర్లో సినిమాలు చూడ‌డ‌ని చెప్పారు. అంత వ‌ర‌కూ బాగానే ఉంది. నెగిటీవ్ రివ్యూలు ఇచ్చిన‌వాళ్ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డాడు. ఎవ‌రో కోన్ కిస్కా గొట్టంగాళ్ల గురించి సినిమాలు తీయ‌మ‌ని, ప్రేక్ష‌క దేవుళ్ల కోసమే సినిమాలు తీస్తామ‌ని, కొంత‌మంది మూర్ఖులు ప‌నిగ‌ట్టుకుని సినిమాపై రాళ్లు విసురుతార‌ని.. తాను ప‌ట్టించుకోన‌ని అలీ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లుగా ఇండ్ర‌స్ట్రీలో ఉంటున్న అలీ… రివ్యూల‌పై ఫైర్ అవ్వ‌డం ఇదే తొలిసారి. బ‌హుశా… చాలా రోజుల త‌ర‌వాత పూర్తి నిడివి ఉన్న పాత్ర‌లో క‌నిపించిన సినిమా, మంచి రిజ‌ల్ట్ రాక‌పోవ‌డం ప‌ట్ల ఆయ‌న నిరాశ ప‌డి ఉంటారు. అందుకే.. ఈ రూపంలో ఆవేశం వెళ్ల‌క‌క్కారు. కాక‌పోతే ఓసీరియ‌ర్ న‌టుడు, ఇండ్ర‌స్ట్రీ గురించి తెలిసిన వ్య‌క్తి, వాక్ చాతుర్యం ఉన్న న‌టుడు… త‌న విచ‌క్ష‌ణ మర్చిపోయి భారీ ప‌దాల్ని వాడ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com