మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీకే ఎగ్జిట్ పోల్స్ ఓటు..!

మహారాష్ట్ర, హర్యానాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తిరుగులేదని ఎగ్జిట్ పోల్స్ తీర్పు వెల్లడించాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ప్రత్యర్థులే లేరని.. ఏకపక్ష విజయాలు ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ- శివసేన కూటమికి సగటున రెండు వందల స్థానాలు ఖాయమని… అన్ని సంస్థలు లెక్కలేశాయి. న్యూస్ 18 సంస్థ అత్యధిగా… బీజేపీ – శివసేన కూటమికి 243 స్థానాలొస్తాయని ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. న్యూస్ ఎక్స్ సంస్థ అతి తక్కువగా.. కూటమికి 150 స్థానాల వరకూ రావొచ్చని వెల్లడించింది. ఎలా చూసినా… బీజేపీ కూటమికి భారీ విజయం ఖాయమని స్పష్టమయింది. మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ – శివసేన కూటమినే అధికారంలో ఉంది.

హర్యానాలోనూ.. ఎగ్జిట్ పోల్స్ అదే తరహా ఫలితాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరింత పట్టు పెంచుకుంటుందని తేల్చాయి. తొంభై స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 70 నుంచి ఎనభై స్థానాలు వస్తాయని… టైమ్స్ నౌ, ఇండియా న్యూస్, న్యూస్ ఎక్స్ ప్రకటించాయి. రెండో స్థానంలో నిలిచే కాంగ్రెస్ పార్టీకి పది నుంచి పన్నెండు సీట్ల వరకూ రావొచ్చని అంచనా వేశాయి. హర్యానాలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు అయిన ఐఎన్‌ఎల్డీ-అకాలీదల్ ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉంది రెండు రాష్ట్రాల్లోనూ అధికార వ్యతిరేకత లేనే లేదని… ఏమైనా ఉన్నా.. మోడీ మానియాలో కొట్టుకుపోయాయని… ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.

రెండు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ దూకుడైన రాజకీయం చేసింది. ఇతర పార్టీలను బలహీనం చేసేందుకు పెద్ద ఎత్తున నేతల్ని చేర్చుకున్నారు. ఆ రాజకీయాన్ని ఇతర పార్టీలు తిప్పికొట్టలేకపోయాయి. కాంగ్రెస్ పార్టీ.. అంతర్గత రాజకీయాలతో.. పోటీ ఇవ్వలేని స్థితికి మొదటగానే చేరింది. దాంతో బీజేపీకి గెలుపు సులువయిందని ఎగ్జిట్ పోల్స్ నిర్ణయించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close