“ఫేక్” ప్రచారం..! జనసేనపై టీడీపీ ఫైర్..!

జనసేన సోషల్ మీడియా ముందూ వెనుకా ఆలోచించకుండా… తెలుగుదేశం పార్టీపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూండటంతో.. ఆ పార్టీ ఒక్క సారిగా రిప్లయ్ ఇచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ఆయన కుటుంబం… హైదరాబాద్‌లోని సెవన్ స్టార్ హోటల్లో ఉండి.. ప్రజాధనాన్ని వందల కోట్లు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారంటూ.. జనసేన మీడియా ప్రచారం చేస్తోంది. అధికారిక హ్యాండిల్ నుంచే ఇలాంటి ప్రచారాలు జరగడంతో.. తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. చంద్రబాబు కుటుంబంపై జనసేన అపనిందలు వెయ్యడాన్ని ఖండిస్తున్నామని సోషల్ మీడియాలో రిప్లయ్ ఇచ్చింది. చంద్రబాబు కుటుంబ అవసరాలకోసం ఎప్పుడూ ప్రజాధనాన్ని వాడుకోలేదని..  నారా భువనేశ్వరి చేసిన చెల్లింపులే సాక్ష్యమని బిల్లులను పోస్ట్ చేశారు. నిజాలు తెలుసుకుని.. అసత్యప్రచారం మానుకోవాలని.. జనసేనకు టీడీపీ సూచించింది.

జనసేన పార్టీ సోషల్ మీడియా ఆ పార్టీ నాయకత్వం గ్రిప్ నుంచి జారిపోయినట్లుగా కనిపిస్తోంది. ఐదు నెలల్లో… పేదల బతుకుల్ని రోడ్డున పడేసిన పాలన అంటూ.. ఓ వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్… రోడ్డెక్కి పోరాటం చేయడానికి సిద్ధమవుతుంటే… జనసేన సోషల్ మీడియా మాత్రం.. తెలుగుదేశం పార్టీపై ఫేక్ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసే ఆరోపణలను… పోస్టర్లుగా చేసి.. అధికారిక హ్యాండిల్‌తో ప్రచారం చేస్తున్నారు. దీంతో.. జనసేన సోషల్ మీడియాలో అత్యధికులు.. వైసీపీ ట్రాప్‌లో ఉన్నారనే భావన .. ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది.

హైదరాబాద్‌లోని పాత ఇంటిని కూల్చి… కొత్త ఇంటిని కడుతున్న సమయంలో… చంద్రబాబు కుటుంబం… మొదట జూబ్లిహిల్స్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంది. అక్కడ సౌకర్యంగా లేకపోవడంతో.. కొన్నాళ్లు మదీనాగూడలో ఉన్న ఫామ్‌హౌస్‌లో కొన్నాళ్లు ఉన్నారు. అక్కడా ఇబ్బందికరంగా ఉండటంతో… కొన్నాళ్లు… హోటల్‌లో ఉన్నారు. ఆ హోటల్‌లో ఉన్నప్పుడు వైసీపీ నేతలు.. ప్రజాధనంతో హోటల్ బిల్లు కడుతున్నారనే ఆరోపణలు చేశారు. దీనిపై టీడీపీ ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది. పూర్తిగా వ్యక్తిగత ఖర్చు అని స్పష్టం చేసింది. అయినా.. వైసీపీ దాన్ని ప్రచారం చేస్తూనే ఉంది. చంద్రబాబు ప్రజల సొమ్మును వ్యక్తిగతంగా వాడుకున్నారంటూ.. వైసీపీ చాలా కాలంగా ప్రచారం చేస్తోంది. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటినప్పటికీ.. ఒక్కటంటే.. ఒక్క దాన్నీ నిరూపించలేకపోయారు. కానీ ఇప్పుడు..  ఆ ఫేక్ ప్రచారాలనే.. జనసేన పార్టీ దత్తత తీసుకుంటోంది. ఫేక్ అని చెప్పిన వారి ఎదురుదాడి చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు...

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

HOT NEWS

[X] Close
[X] Close