పవన్ ని పొగిడిన అలీ, అప్పటి మాటలను గుర్తు చేసిన జన సైనికులు

కమెడియన్ ఆలీ కి, పవన్ కళ్యాణ్ కి మధ్య ఒకప్పుడు ఉన్న సన్నిహిత సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకానొక సందర్భంలో, ” ఆలీ లేకుండా నీవు సినిమా తీయలేవా ” అని తన తల్లి అడిగిందని పవన్ ఒక ఆడియో ఫంక్షన్ లో చెప్పారు. అయితే అదంతా గతం. 2019 ఎన్నికలకు ముందు ఆలీ వైఎస్సార్సీపీ లో చేరడం, పవన్ మీద ఓ రేంజ్ లో విరుచుకుపడడం తెలిసిందే. అప్పటి నుండి ఆ గ్యాప్ అలా ఉండగా, నిన్న సాయంత్రం పవన్ ని పొగుడుతూ ట్వీట్ చేశారు ‌

ఆలీ ట్వీట్ చేస్తూ,” వ్యక్తిత్వం లో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు…ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా చెదరని నీ నవ్వు కి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు…” అని ట్వీట్ చేసారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అందరు హీరో ల మీద పాజిటివ్ ట్వీట్స్ వేస్తూ వారి అభిమానుల నుండి కాంప్లిమెంట్స్ అందుకుంటున్న అలీకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుండి మాత్రం నిష్టూరాలు ఎదురవుతున్నాయి. ఆలీ వేసిన ట్వీట్ లోని “ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా” అన్న మాటలను ఉటంకిస్తూ, “అలా అన్న వారిలో మీరు కూడా ఉన్నారు కదా సర్” అంటూ అతనికి గుర్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. మరికొందరైతే “ఇప్పుడేమో ప్రాణమిత్రుడు అని అంటున్నావ్ కానీ, ఆ మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయనకు బాసటగా నువ్వు లేవు కదా” అని గుర్తు చేస్తున్నారు. “సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని మీరు ఎంత సమర్థించుకున్నా, మీరు అప్పుడు పవన్ కళ్యాణ్ ని హేళన చేస్తూ చేసిన వ్యాఖ్యలు మేము మర్చిపోలేకపోతున్నా” మంటూ మరి కొందరు అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

మొత్తానికి ఎన్నికల సమయంలో తిట్టిన నోళ్ళే, ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మంచితనం గురించి మాట్లాడడం గమనార్హం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close