“కూల్చివేత” ఆపేందుకు ఎన్జీటీకి రేవంత్..!

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతను అడ్డుకునేందుక టీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి… రంగంలోకి దిగారు. ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో పిటిషన్ వేశారు. సెక్రటేరియట్ కూల్చివేత వల్ల.. పర్యావరణానికి తీవ్రమైన హాని జరుగుతుందని తక్షణం నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. కూల్చివేత కోసం.. ఎలాంటి అనుమతి తీసుకోలేదని.. పైగా సెక్రటేరియట్.. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉందని.. గుర్తు చేశారు. కూల్చివేత వల్ల వస్తున్న వ్యర్థాల వల్ల.. హుస్సేన్ సాగర్.. కాలుష్యం బారిన పడుతుందని.. చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సెక్రటేరియట్ కూల్చివేతపై పదిహేనో తేదీ వరకూ.. హైకోర్టు స్టే ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. గతంలో హైకోర్టు కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ జరగాల్సి ఉంది.

రేవంత్ రెడ్డి గతంలో… కేటీఆర్ ఫార్మ్‌హౌస్ జన్వాడ అనే గ్రామంలో ఉందని… అది జీవో నెంబర్ 111కి విరుద్ధంగా ఉందని వాదిస్తూ.. ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దాంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్.. ఫార్మ్‌హౌస్ పై విచారణకు కమిటీని నియమించింది. ఆ ఫామ్‌హౌస్‌తో ఎలాంటి సంబంధం లేదని వాదిస్తూ… వచ్చిన టీఆర్ఎస్ నేతలు.. కేటీఆర్ కూడా… ఈ విచారణ ఆదేశాలతో షాక్ కు గురయ్యారు. హైకోర్టులో పిటిషన్ వేసి.. విచారణపై స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు రేవంత్.. సెక్రటేరియట్ కూల్చివేత విషయంలోనూ.. ఎన్జీటీ పిటిషన్‌నే ఆయుధంగా చేసుకుంటున్నారు.

ప్రస్తుతం సెక్రటేరియట్ కూల్చివేత సగంలో ఉంది. ఇప్పుడు ఆగిపోతే.. ఆ శిథిలాలు… అలాగే ఉండిపోతాయి. అది ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరం అవుతుంది. అందుకే ప్రభుత్వం కూడా… విపక్ష పార్టీలకు మరోసారి చాన్సివ్వకుండా… కూల్చివేతకు అనుమతులు సాధించాలన్న పట్టదలతో ఉంది. ఓ వైపు.. ప్రభుత్వం కూల్చివేయాలని మరో వైపు విపక్షాలు.. కూల్చివేతను అడ్డుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో ఎవరిది పైచేయి అవుతుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close