చైతన్య : రాజేంద్రా.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్..!?

తల ఎక్కడ పెట్టుకుంటావ్ రాజేంద్రా..? .. అని నిండు సభలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడిగినప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌తో ఎదురుదాడి చేసిన ఈటల రాజేందర్‌కు ఇప్పుడు నిజంగానే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. కన్నుమిన్నూ కాన రాకుండా తెలంగాణ ఉద్యమం పేరుతో సీమాంధ్రులపై విషం చిమ్మి… నీళ్లు.. నిధులు.. నియామకాల పేరుతో అమాయకుల్ని రెచ్చగొట్టి.. కొన్ని వందల ప్రాణాలు బలైపోవడానికి కారణమైన వారిలో ఒకరైన ఈటల రాజేందర్ … ఇప్పుడు తాము తెచ్చుకున్న తెలంగాణలోనే తన తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక … కుమిలిపోతున్నారు. తన తెలంగాణలో తనకీ దుస్థితి.. తన నాయకుడే కల్పించడం.. ఆయన ఊహించి ఉండరు.

ఉద్యమం పేరుతో చేసిన పాపాల ఫలితం..!

ఈటల రాజేందర్ నిఖార్సైన తెలంగాణ వాది. కేసీఆర్‌కు.. చంద్రబాబు మంత్రివర్గంలో పదవి దక్కక…తెలంగాణ ఉద్యమాన్ని నెత్తికెత్తికోవాలనుకున్నప్పుడు.. పిడికెడు మంది కూడా ఆయన వెంట లేరు. ఉన్న పిడికెడు మందిలో ఈటల రాజేందర్ ముఖ్యులు. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్ కోసం.. తెలంగాణ ఉద్యమం కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి ఈటల రాజేందర్. ఓ సందర్భంలో వైఎస్ దెబ్బకు టీఆర్ఎస్ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోక పోయి ఉంటే హరీష్ రావు కూడా వెళ్లి.. కాంగ్రెస్‌లో చేరి ఉండేవారన్న ప్రచారం జరిగింది. అప్పుడే తెలంగాణ భవన్‌ను .. రెబల్ ఎమ్మెల్యేలు స్వాధీనం చేసుకుంటారన్న భయంతో.. స్వయంగా కేసీఆర్ వెళ్లి.. ఓ రాత్రి తెలంగాణ భవన్‌లో పడుకున్నారు. అలాంటి దుర్భరపరిస్థితుల్లో కేసీఆర్ వెంట ఉన్నది ఈటల రాజేందర్. అంతే కాదు.. తెలంగాణ ఉద్యమానికి ఊపు రావాలంటే.. సీమాంధ్రుల్ని తిట్టాలి.. యువతను రెచ్చగొట్టాలి అన్న వ్యూహాల్ని పక్కాగా అమలు చేయడంలోనూ ఈటల పాత్రధారి. ఓ రకంగా… తెలంగాణ ఉద్యమం ఓ రేంజ్‌కు వెళ్లడానికి మొదటి కారణం హరీష్ అయితే.. రెండో కారణం ఈటల. కేసీఆర్ మూల విరాట్‌గా మాత్రమే ఉన్నారు. అయితే తాము బలిదానాలతో .. రాజకీయ పోరాటంతో తెచ్చిన తెలంగాణలో ఇప్పుడు ఆయనకు అవమానాలు ఎదురవుతున్నాయి.

సీమాంధ్ర పాలకుల హయాంలో తలెక్కడా దించలేదుగా రాజేంద్రా..!?

సీమాంధ్ర పాలకులు ఉన్నప్పుడు…ఈటల రాజేందర్ రాజకీయ నాయకుడిగానే ఉన్నారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. కానీ ఆయన ఎప్పుడూ అవమానాలకు గురి కాలేదు. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు చూడలేదు. అంతకు మించి.. ఏమీ చేయకపోయినా ఏదో చేశాడని … ఈ సోకాల్డ్ తెలంగాణ వాదులు చెప్పే సీమాంధ్ర పాలకులు కూడా.. నిందలు వేయలేదు. రాజకీయాన్ని రాజకీయంగానే చూశారు. అలాగే ఎదుర్కొన్నారు. ఆయన టీఆర్ఎస్ పక్ష నేతగా ఉన్న ప్పుడు అసెంబ్లీలో మాటల మాట అనగలిగారు. ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓటములను ప్రశ్నిస్తూ.. తలెక్కడ పెట్టుకుంటావ్ .. రాజేంద్రా అని వైఎస్ అంటే.. ఎదురు సమాధానం చెప్పగలిగారు. అప్పుడు తలెత్తుకోగలిగారు. కానీ ఇప్పుడు… స్వయం పాలనలో .. కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఆయన తల ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకుంటున్నారు.

కోరి తెచ్చుకున్నతెలంగాణలో ఇంకెన్ని అవమానాలు ఉండబోతున్నాయో తెలుసా.. !?

టైం …ప్రతి ఒక్కరి దూల తీర్చేస్తుంది. అది కాస్త ముందుగా…. లేకపోతే కాస్త ఆలస్యంగా. తాము కుట్రలు.. కుతంత్రాలతో చేసిన వాటికి తప్పనిసరిగా అనుభవించాల్సిందే. సీమాంధ్రులు ఏమీ చేయకపోయినా.. వీలైనంతగా తెలంగాణ అభివృద్ధికి వారు ఇతోధికంగా సాయం చేసినా… సీమాంధ్రులు ఏదో దోచి పెట్టుకున్నారని చేసిన విష ప్రచార పాపాన్ని కోరి తెచ్చుకున్నతెలంగాణలో ఈటల అనుభవించడం ప్రారంభించారు. అది ఆరంభం మాత్రమేనని.. ఆయన ఉద్యమనాయకుడు టీజర్లు పంపుతున్నారు. ముందు ముందు ఈటల… కటకటాల వెనక్కి పోయినా ఆశ్చర్యం లేదు. అది కూడా.. ఈటల చేసిన ఉద్యమ తప్పునకు చిన్న శిక్షే. అంత మించిన శిక్షలు ఎదురొస్తూనే ఉంటాయి. ఎందుకంటే… తెలంగాణ ఉద్యమం పేరుతో.. రాజకీయ ప్రయోజనాల కోసం… ఏ పాపం తెలియని సీమాంధ్రుల్ని నేరస్తులుగా నిలబెట్టిన పాపం ఊరకనే వదిలి పెట్టదు.

ఇవాళ ఈటల.. రేపు అధికారం మారితే కేసీఆర్‌కూ తప్పదు..!?

ఇప్పుడు ఈటల రాజేందర్.. తర్వాత మరొకరు.. అంతిమంగా కేసీఆర్‌కు కూడా ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదురవడానికే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. ఎప్పుడో ఓ సారి పోగొట్టుకోవాల్సిందే. ఆలా పోయినప్పుడు.. ఇప్పుడు తాము చర్యలకు రివర్స్ యాక్షన్‌లు అనుభవించాల్సింది. అది ఉద్యమంలో భాగంగా ఏ పాపం తెలియని వారిని బలి పశువుల్ని చేయండలో అయినా… రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టడంలో అయినా… చేసిన దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఈటల ఇప్పుడు అదే స్టేజ్‌లో ఉన్నారు. త్వరలో మరికొంత మందికి ఇదే గతి పట్టబోతోందని ఇప్పటికే సంకేతాలు కూడా అందాయి. సీమాంధ్రులకు చేసిన పాపం.. ఊరకనే పోదు మరి..!

ఇప్పుడు రాజేంద్రనే చెప్పాలి.. తల ెక్కడ పెట్టుకుంటారో.. ? సీమాంధ్రుల పాలనలో తల ఎత్తుకున్నారా..? స్వయం పాలనలో తలెక్కడ పెట్టుకోవాలో వెదుక్కుంటున్నారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐడీపై సుప్రీంకోర్టుకెళ్లిన ఏబీఎన్, టీవీ5..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమపై నమోదు చేసిన రాజద్రోహం కేసులు కుట్రపూరితమని.. తక్షణం ఆ కేసులపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు టీవీ చానళ్లు వేర్వేరుగా...

కరోనా అనాథల్ని చేసిన పిల్లలకు అండగా జగన్..!

కరోనా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు ముసిరేలా చేస్తోంది. కొన్ని చోట్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోగా.. మరికొన్ని చోట్ల..తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయి చిన్నారు అనాథలవుతున్నారు. ఒకటో.. రెండో కాదు.. దాదాపుగా ప్రతి ఊరిలోనూ...

రఘురామ కేసులో “సుప్రీం” టర్న్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో సీఐడీ పోలీసులు కొట్టారో లేదో తేల్చడానికి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించాలని.....

ఈ సారీ కౌంటర్ దాఖలుకు సీబీఐ, జగన్‌కు తీరలేదు..!

రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో కౌంటర్ దాఖలు చేయడానికి వారాలకు వారాల గడువు సీబీఐకి సరిపోవడం లేదు. ఒక్క సీబీఐకే కాదు.... నిందితుడైన జగన్మోహన్ రెడ్డికీ...

HOT NEWS

[X] Close
[X] Close