మీడియా వాచ్ : కొత్త యాజమాన్యంలోకి మహా టీవీ ..!

తెలుగు మీడియా రంగంలో మరో చానల్ చేతులు మారింది. మహా టీవీని బీజేపీకి చెందిన ఎంపీ ఒకరు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన పూర్తిగా చానల్ స్వరూపాన్ని మార్చేస్తున్నారు. టీవీ9తో కెరీర్ ప్రారంభించి… అనేకానేక చానళ్లు తిరిగి… చివరికి జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షితో ఎక్కువ అనుబంధం కొనసాగించిన స్వప్నకు.. ఆ చానల్ బాధ్యతలు అప్పగించారు. ఆమె ఇప్పటికే సోషల్ మీడియాలో… ఈ విషయాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. తాను చేపట్టబోయే చర్చా కార్యక్రమాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు.

మహాటీవీ ఇప్పటికి ఎన్ని చేతులు మారిందో లెక్కే లేదు. మొదటగా.. ఈ చానల్‌ను.. ప్రముఖ జర్నలిస్ట్ ఇనగంటి వెంకట్రావు ప్రారంభించారు. మొదట్లో.. ఇప్పుడు టీవీ9ని ఒంటి చేత్తో తిప్పేస్తున్న రజనీకాంత్ ఆ చానల్‌లో చేరారు. కానీ.. పునాదుల్ని లేపడం ఆయన వల్ల కాక.. మధ్యలోనే చేతులెత్తేసి..మళ్లీ రవిప్రకాష్ దగ్గరకు చేరిపోయారు. ఆయనను నమ్ముకుని వెంకట్రావు కూడా మునిగిపోయారు. పునాదులే బలహీనంగా పడటంతో ఆ చానల్ నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత వరుసగా యాజమాన్యాలు మారుతూ వస్తోంది. టీడీపీ హయాంలో జర్నలిస్టుగా పని చేసిన వంశీ అనే వ్యక్తి ఆ చానల్ నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు. కొంత మంది టీడీపీ నేతలు సహకరించారని చెప్పుకున్నారు కానీ తెరమీదకు ఎవరూ రాలేదు.

కొన్నాళ్లు సుజనా చౌదరి నడిపారని..మరికొన్నాళ్లు పరకాల ప్రభాకర్ బాధ్యత తీసుకున్నారనిచెప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం యాజమాన్యం మారింది. దీంతో మార్పు కనిపిస్తోంది. ఆ యాజమాన్యం… ముందు ఎవరు ఉన్నా.. తెర వెనుక మాత్రం బీజేపీ సపోర్టరనన్న చర్చ మాత్రం నడుస్తోంది. పుట్టినప్పటి నుండి దినదిన గండం అన్నట్లుగా ఉన్న.. మహాటీవీకి ఎప్పుడూ… ఆర్థిక పరంగా ఇబ్బందికర పరిస్థితులు రాలే్దు. ఎవరో ఒకరు వచ్చి చానల్‌ను నడిపిస్తూనే ఉన్నారు. ఒకరి ఓపిక అయిపోయాక..మరొకరు వచ్చి.. చానల్‌ను నడిపిస్తున్నారు. ఇప్పుడు… ఆ చానల్ స్వప్న చేతుల్లోకి వెళ్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐడీపై సుప్రీంకోర్టుకెళ్లిన ఏబీఎన్, టీవీ5..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమపై నమోదు చేసిన రాజద్రోహం కేసులు కుట్రపూరితమని.. తక్షణం ఆ కేసులపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు టీవీ చానళ్లు వేర్వేరుగా...

కరోనా అనాథల్ని చేసిన పిల్లలకు అండగా జగన్..!

కరోనా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు ముసిరేలా చేస్తోంది. కొన్ని చోట్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోగా.. మరికొన్ని చోట్ల..తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయి చిన్నారు అనాథలవుతున్నారు. ఒకటో.. రెండో కాదు.. దాదాపుగా ప్రతి ఊరిలోనూ...

రఘురామ కేసులో “సుప్రీం” టర్న్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో సీఐడీ పోలీసులు కొట్టారో లేదో తేల్చడానికి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించాలని.....

ఈ సారీ కౌంటర్ దాఖలుకు సీబీఐ, జగన్‌కు తీరలేదు..!

రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో కౌంటర్ దాఖలు చేయడానికి వారాలకు వారాల గడువు సీబీఐకి సరిపోవడం లేదు. ఒక్క సీబీఐకే కాదు.... నిందితుడైన జగన్మోహన్ రెడ్డికీ...

HOT NEWS

[X] Close
[X] Close