ఆగ‌స్టులో మొద‌లు… వేస‌విలో విడుద‌ల‌

‘అత‌డు’ త‌ర‌వాత మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ కాంబో సెట్ట‌య్యింది. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చి చాలాకాల‌మైనా షూటింగ్ ఇంకా మొద‌లు కానేలేదు. క‌థ కుద‌రిందా, స్క్రీన్ ప్లేలో మార్పులు జ‌రుగుతున్నాయా, న‌టీన‌టుల ఎంపిక పూర్త‌వ‌లేదా? అంటూ ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపించాయి. అయినా చిత్ర‌బృందం నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ చాలా ర‌కాలైన పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కానీ… ఇప్ప‌టి వ‌ర‌కూ ఏదీ ఖ‌రారు కాలేదు. అస‌లు చిత్ర‌బృందం నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దాంతో ఫ్యాన్స్ ఉస్సూరుమంటున్నారు. ఇప్పుడు వాళ్లంద‌రికీ ఓ తీపి వార్త‌. మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమా మొద‌లైపోతోంది. ఆగ‌స్టులో.

అవును… ఆగ‌స్టు నుంచి చిత్రీక‌ర‌ణ మొద‌లెట్ట‌నున్నామ‌ని చిత్ర‌బృందం అధికారిక ప్ర‌క‌ట‌న ఇచ్చేసింది. అంతేకాదు… రిలీజ్ గురించిన క‌బురు కూడా చెప్పేసింది. 2023 వేస‌విలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. మే లేదా జూన్‌లో ఈ సినిమా బ‌య‌ట‌కు రావొచ్చు. ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల్సిన బాధ్య‌త త్రివిక్ర‌మ్ దే. ఎందుకంటే… ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే, మ‌హేష్ బాబు రాజ‌మౌళితో జ‌త‌క‌ట్టాల్సివుంది. ఆయ‌న మ‌హేష్ కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకే త్రివిక్ర‌మ్ కూడా చ‌క చ‌క సినిమా ఫినిష్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. హారిక హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

ఔట్ సోర్సింగ్‌లో పని లేనోళ్లనే తీసేస్తున్నారట !

సీఎం జగన్‌కు కోపం వచ్చిందంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే.. పదేళ్ల లోపు సర్వీస్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ తొలగించాలని ఇచ్చిన ఆదేశాలను చూసి ఆయనకు కోపం వచ్చిందట. అదేంటి.. ఇంత...

పేరు సీమగర్జన – వినిపించింది చంద్రబాబుపై తిట్ల దండకం !

సీమగర్జన పేరుతో వైసీపీ నాయకులు కర్నూలులో చేసిన హడావుడి ప్రహసనంగా మారింది. పరిస్థితి అర్థమయిందేమో కానీ కర్నూలుకు వచ్చి ప్రసంగిస్తానని గట్టి హామీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సమావేశానికి హాజరు...

బాల‌య్య హీరోయిన్ దొరికేసిన‌ట్టేనా..?

బాల‌కృష్ణ తో సినిమా అంటే ద‌ర్శ‌కుల‌కు పండ‌గే. ఎందుకంటే..ఆయ‌న డైరెక్ట‌ర్ల హీరో. సెట్లో ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేసేస్తారాయ‌న‌. అందుకే ద‌ర్శ‌కులంతా బాల‌య్య‌తో ప‌నిచేయ‌డానికి ఎదురు చూస్తుంటారు. కాక‌పోతే... బాల‌య్య సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close