వ‌య‌లెన్స్ పెరిగిందా ‘వారియ‌ర్‌?’

త‌మిళ ద‌ర్శ‌కులు కాస్త వ‌యెలెన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పైగా ఆయా సన్నివేశాల్ని చాలా `రా`గా తీసి ప‌డేస్తారు. త‌మిళ ప్రేక్ష‌కుల‌కు అలానే న‌చ్చుతాయి మ‌రి. వ‌యెలెన్స్ అన‌గానే హ‌రి, లింగుస్వామి లాంటి డైరెక్ట‌ర్లు గుర్తొస్తారు. ఇప్పుడు లింగుస్వామి తెలుగులో నేరుగా ఓ సినిమా చేశాడు. అదే `వారియ‌ర్‌`. ఇందులోనూ కావ‌ల్సినంత హీరోయిజం, ఫ‌న్ తో పాటుగా.,. యాక్ష‌న్‌, హింస‌, ర‌క్త‌పాతం ఉన్నాయ‌ట. లింగుస్వామి ఆయా స‌న్నివేశాల్ని త‌మిళ స్టైల్ లో తీసుకొంటూ పోయాడ‌ని, అవి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఏ మేర‌కు ఆకట్టుకుంటాయో కాస్త సందిగ్థంలో ఉంద‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

ముఖ్యంగా సెకండాఫ్‌లో ర‌క్త‌పాతం ఏరులై పారింద‌ట‌. అందుకే ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర ఆయా సీన్స్‌ని ట్రిమ్ చేసే ప‌నిలో ప‌డ్డార‌ని తెలుస్తోంది. ఈ సినిమాతో ఆది పినిశెట్టి విల‌న్ గా న‌టించాడు. త‌న‌లోని క్రూర‌త్వం చూపించ‌డానికి కొన్ని సీన్లు రాసుకొన్నాడ‌ట ద‌ర్శ‌కుడు. అవి మ‌రీ ఓవ‌ర్ ది బోర్డ్ అనిపించేలా ఉన్నాయ‌న్న ఫీలింగ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఇప్పుడొచ్చింద‌ట‌. అందుకే ఆ సీన్లు త‌మిళంలో అలానే ఉంచేసి, తెలుగులో మాత్రం క‌త్తెరించార‌ని స‌మాచారం. ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రూపొందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో రామ్ త‌న త‌మిళ మార్కెట్ ని పెంచుకోవాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ ఓకే అనిపించుకొంది. బుల్లెట్ సాంగ్ మాస్‌కి బాగా న‌చ్చింది. విజిల్ సాంగ్ కూడా కేక పుట్టించింది. మిగిలిన పాట‌లెలా ఉంటాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close