10న ప్ర‌భాస్ సినిమాకి క్లాప్‌

ప్ర‌భాస్ – మారుతి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 10న లాంఛ‌నంగా క్లాప్ కొట్ట‌నున్నారు. సెట్స్‌పైకి వెళ్ల‌డానికి మాత్రం కాస్త స‌మ‌యం ప‌డుతుంది.ప్ర‌స్తుతం మారుతి క‌థ‌కి తుదిమెరుగులు దిద్దే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇదో హార‌ర్ కామెడీ సినిమా అని తెలుస్తోంది. బొమ‌న్ ఇరానీ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా కోసం హైద‌రాబాద్ లో కొన్ని ప్ర‌త్యేక‌మైన సెట్స్‌ని తీర్చిదిద్దుతున్నారు. అందులోనే సింహ భాగం షూటింగ్ జ‌ర‌గ‌బోతోంది. ఇందులో ముగ్గురు క‌థానాయిక‌ల‌కు చోటుంది. వాళ్ల పేర్లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే క‌థానాయిక‌ల ఎంపిక ఇంకా ఖ‌రారు కాలేద‌ని టాక్‌. లేటెస్టుగా శ్ర‌ద్ధా క‌పూర్‌, పూజా హెగ్డే పేర్లు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అయితే వీటిపై ఓ క్లారిటీ అంటూ లేదు. ప్రభాస్ ద‌గ్గ‌ర ఓ లిస్టు ఉంద‌ని, ప్ర‌భాస్ ఎవ‌రినైతే ఎంపిక చేస్తాడో, వాళ్లే ఫైన‌ల్ అని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాని పూర్తి చేసి, విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌. వేగంగా సినిమాలు తీయ‌డంలో మారుతి.. సిద్ధ‌హ‌స్తుడు. పైగా హార‌ర్ కామెడీ కాబ‌ట్టి, ఆడుతూ పాడుతూ లాగించేస్తాడు. అన్నీ కుదిరితే.. సినిమాప‌ట్టాలెక్కిన ఆరునెల‌ల్లో పూర్తి చేసి విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close