డ్రగ్స్‌ కేసు: నిహారికపై నాగబాబు క్లారిటీ.. హేమ ఆవేదన

బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ బయటపడటం ఇప్పుడు అంతటా హాట్‌ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆసమయంలో పబ్‌లో ఉన్న నిహారిక, రాహుల్‌ సిప్లిగంజ్‌తోపాటు పలువురని అదుపులోకి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసుతో నిహారికకు సంబంధం లేదని నాగబాబు క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. రా”డిసన్‌ బ్లూ క్లబ్ పై పోలీసులు రైడ్ చేశారు. అప్పుడు నిహారిక అక్కడే వుంది. అయితే నిహారికకు డ్రగ్స్ తో సంబంధం లేదని పోలీసులే స్వయంగా చెప్పారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న దుస్ప్రచారాలు తావు ఇవ్వకూడదని ఈ వివరణ ఇస్తున్నాను” అని వెల్లడించారు నాగబాబు.

అదలావుంటే ఈ కేసుతో సంబంధం లేకపోయినప్పటికీ తన పేరుని పలు ఛానళ్లల్లో ప్రసారం చేస్తున్నారని నటి హేమ ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి అవాస్తవాలు ప్రసారం చేస్తోన్న సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆమె బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ‘‘నేను అసలు పబ్‌కే వెళ్లలేదు. డ్రగ్స్‌ కేసు అనేది చిన్న విషయం కాదు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కొందరు కావాలనే నా పేరుని ప్రసారం చేస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాలికో న్యాయం .. జగన్‌కో న్యాయమా ?

గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి...

ఇక టీఆర్ఎస్ పార్టీ లేనట్లేనా !?

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి...

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close