“మత్తు ఎమ్మెల్యే”లంతా టీఆర్ఎస్ వాళ్లే..!?

బెంగళూరు పోలీసుల డ్రగ్స్ కేసు ఆపరేషన్ టీఆర్ఎస్‌లో తుపాను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగళూరు పోలీసుల రాడార్‌లో నలుగురు ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్‌కు చెందిన వారేనని.. ఆపార్టీలో గుప్పు మంటోంది. ఒకరు కాంగ్రెస్ తరపున అనూహ్య విజయం సాధించి.. టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మిగిలినముగ్గురూ ఉమ్మడిగా తెలంగాణ జిల్లాకు చెందినవారిగా టీఆర్ఎస్‌లోనే ఓ అంచనాకు వచ్చారు. వీరిలో ఒకరిపై గతంలోనూ డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన ఇద్దరూ బెంగళూరు లింక్‌తో హైలెట్ అవుతున్నారు.

ప్రధానంగా కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే చుట్టూ ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన యువకుడు. అంతే కాదు.. ఫేజ్ త్రీ పార్టీల పై ఎక్కువ ఆసక్తిగా ఉంటారు.కొన్నాళ్ల కిందట.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో దాడి జరిగింది. ఆ ఘటనలో ప్రధానంగా ఈ ఎమ్మెల్యే పేరు కూడా వినిపించింది. పార్టీలంటే పడి చచ్చే ఎమ్మెల్యే బెంగళూరుకూ తరచూ వెళ్తూంటారని.. అక్కడే ఇరుక్కుపోయారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. బెంగళూరు పోలీసులు ప్రధానంగా ఒక ఎమ్మెల్యే గురించి పూర్తి స్థాయి ఆధారాలు సేకరించి.. విచారణకు పిలుస్తున్నారు. ఆయన వెళ్లడంలేదు.

రేపో మాపో అరెస్ట్ చేసి తరలించే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. దీంతో ఆ ఎమ్మెల్యే ఆజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యేను బెంగళూరు పోలీసులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పట్టుకుంటే… తర్వాత పొలిటికల్ సీన్ కూడా మారిపోతుందన్న అభిప్రాయం… వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీసులు డ్రగ్స్ కేసును కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టినట్లుగా బెంగళూరు పోలీసులు పెట్టకపోతే… ఇక్కడ సంచలనాలు.. నమోదయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close