డైలామాలో న‌రేష్‌

ఎనిమిదేళ్ల పాటు ఒక్క హిట్టు కూడా లేక‌పోవ‌డం అంటే మాట‌లు కాదు. మ‌రో హీరో అయితే.. త‌న‌ని మ‌ర్చిపోయేవారు. కానీ అల్ల‌రి న‌రేష్ వేసుకున్న పునాది గ‌ట్టిది. కాబ‌ట్టి.. అన్ని ఫ్లాపులొచ్చినా త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. త‌న‌పై నిర్మాత‌లు ఇంకా న‌మ్మ‌కం ఉంచుతున్నారు. కానీ.. త‌న‌తో త‌న‌కే న‌మ్మ‌కం స‌డ‌లిపోయింది. అందుకే `నాంది` హిట్ అవ్వ‌గానే, వేదిక‌పైనే ఏడ్చేశాడు. అంత ఎమోష‌న్ అయిపోయాడు.

నాందితో.. మ‌రో న‌రేష్ బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌న్న‌ది వాస్త‌వం. త‌న‌లో ఈసినిమా చాలా న‌మ్మ‌కాన్ని పెంచింది. అయితే కాస్త గంద‌రగోళ‌మూ తెచ్చింది. `నాంది` త‌ర‌వాత ఎలాంటి క‌థ‌లెంచుకోవాలి? అనే విష‌యంలో న‌రేష్ కి సందిగ్థం మొద‌లైంది. `నాంది` సీరియ‌స్ డ్రామా. `నువ్వు ఇలాంటి క‌థ‌లే చేయాలి` అని నాని లాంటి హీరోలు సైతం.. గ‌ట్టిగా స‌ల‌హాలు ఇచ్చారు. కానీ… న‌రేష్ బ్రాండ్ వినోదం. దాన్ని మ‌ర్చిపోతే ఎలా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. `నాంది` ద‌ర్శ‌కుడే న‌రేష్ తో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడిప్పుడు. అది కూడా సీరియ‌స్ క‌థ‌నే. వ‌రుస‌గా అలాంటి క‌థ‌లు చేయాలా? మ‌ధ్య‌మ‌ధ్య‌లో కామెడీలు చేయాలా? అనే విష‌యం ఏమాత్రం పాలుపోవ‌డం లేదు అల్ల‌రోడికి. న‌రేష్ త‌దుప‌రి సినిమా `నాంది` త‌ర‌హాలోనే సీరియ‌స్ గా సాగ‌బోతోంద‌ట‌. కానీ.. న‌రేష్ చేతిలో ఎప్ప‌టిలానే కామెడీ క‌థ‌లూ ఉన్నాయి. అదొక‌టి, ఇదొక‌టి త‌ర‌హాలో… బాలెన్స్ చేసుకుంటూ వెళ్తే.. న‌రేష్ నుంచి మ‌రిన్ని వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాలు చూడొచ్చు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రశ్నలన్నీ వైఎస్ విజయలక్ష్మికే..!

వైసీపీ గౌరవాధ్యక్షురాలికి కాలం అంతగా కలసి రావడం లేదు. వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉండి.. మరో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటే.. తాజాగా షర్మిలపై తెలంగాణ పోలీసులు...

తెలంగాణలో “గుర్తు”ను కోల్పోయిన జనసేన..!

జనసేన పార్టీకి.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఏదీ కలసి రావడం లేదు. బీజేపీతో స్నేహం కోసం గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో తెలంగాణలో జనసేన పార్టీ తన...

మోడీ ఎడాపెడా అడిగేస్తున్న జగన్..!

టీకా ఉత్సవ్ అంటూ.. ఉత్సవాలు చేస్తున్నారు కానీ.. టీకాలు మాత్రం కావాల్సినన్ని పంపడం లేదని కేంద్రం వైఫల్యాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజల ముందు పెడుతున్నారు. గత...

కొర‌టాల ద‌గ్గ‌ర క‌థే లేదా?

త్రివిక్ర‌మ్ - ఎన్టీఆర్ సినిమా వాయిదా ప‌డ‌డంతో, ఎన్టీఆర్ - కొర‌టాల శివ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టైంది. ఆఘ‌మేఘాల మీద‌... ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత‌.. ఎన్టీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close