య‌ష్ సినిమాలో ప్ర‌భాస్‌?

కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు య‌ష్‌. ఇప్పుడు అంద‌రి దృష్టీ కేజీఎఫ్ 2 పై ఉంది. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్.. పార్ట్ 2 బ‌య‌ట‌కు రాకుండానే, ప్ర‌భాస్ సినిమాతో బిజీ అయిపోయాడు. కేజీఎఫ్‌లో య‌ష్‌ని సూప‌ర్ మాసీగా చూపించిన ప్ర‌శాంత్ ఇప్పుడు ప్ర‌భాస్ ని ఎలా చూపిస్తాడా? అంటూ ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది చిత్ర‌లోకం.

అస‌లు నిజ‌మేంటంటే.. ఇప్పుడు ప్ర‌భాస్ తో చేస్తున్న `స‌లార్‌` సినిమా క‌థ కూడా య‌ష్‌ని ఉద్దేశించి రాసుకున్న‌దేన‌ట‌. `కేజీఎఫ్‌` స‌మ‌యంలో య‌ష్ కి చెప్పిన క‌థ‌ల్లో ఇదొక‌ట‌ని, య‌ష్‌.. కేజీఎఫ్‌ని ఎంచుకుని, `స‌లార్‌`ని ప‌క్క‌న పెట్టాడ‌ని టాక్‌. నిజానికి కేజీఎఫ్ చూస్తున్న‌ప్పుడు కూడా.. మ‌న తెలుగు ఆడియ‌న్స్ య‌ష్ స్థానంలో ప్ర‌భాస్ ని ఊహించుకుని ఉంటారు. `ఈ సీన్ లో ప్ర‌భాస్ ఉంటే ఎలా ఉండేదో.` అనిపించచ‌డం చాలా స‌హ‌జం. ఎందుకంటే ఆ సినిమాలో యష్ బాడీ లాంగ్వేజ్ అలానే ఉంటుంది. ఇప్పుడు య‌ష్ కోసం రాసుకున్న క‌థ ప్ర‌భాస్ కి చేరింది. కాక‌పోతే.. ప్ర‌భాస్ ఇమేజ్ వేరు. త‌న స్టామినా వేరు. దానికి త‌గ్గ‌ట్టే… ప్ర‌శాంత్ నీల్ మార్పులూ, చేర్పులూ చేసి ఉంటాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రశ్నలన్నీ వైఎస్ విజయలక్ష్మికే..!

వైసీపీ గౌరవాధ్యక్షురాలికి కాలం అంతగా కలసి రావడం లేదు. వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉండి.. మరో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటే.. తాజాగా షర్మిలపై తెలంగాణ పోలీసులు...

తెలంగాణలో “గుర్తు”ను కోల్పోయిన జనసేన..!

జనసేన పార్టీకి.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఏదీ కలసి రావడం లేదు. బీజేపీతో స్నేహం కోసం గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో తెలంగాణలో జనసేన పార్టీ తన...

మోడీ ఎడాపెడా అడిగేస్తున్న జగన్..!

టీకా ఉత్సవ్ అంటూ.. ఉత్సవాలు చేస్తున్నారు కానీ.. టీకాలు మాత్రం కావాల్సినన్ని పంపడం లేదని కేంద్రం వైఫల్యాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజల ముందు పెడుతున్నారు. గత...

కొర‌టాల ద‌గ్గ‌ర క‌థే లేదా?

త్రివిక్ర‌మ్ - ఎన్టీఆర్ సినిమా వాయిదా ప‌డ‌డంతో, ఎన్టీఆర్ - కొర‌టాల శివ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టైంది. ఆఘ‌మేఘాల మీద‌... ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత‌.. ఎన్టీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close