‘క‌రోనా’పై క‌థ రాసిన అల్ల‌రోడు

క‌రోనా మ‌హ‌మ్మారి చిత్ర రంగాన్ని స్థంభింప‌జేసింద‌న్న‌ది ఎంత నిజ‌మో, స‌రికొత్త ఆలోచ‌న‌ల‌కు బీజం వేసింద‌న్న‌ది కూడా అంతే నిజం. సినిమాల‌కు క‌రోనా ఓ కొత్త క‌థా వ‌స్తువు అయిపోయింది. లాక్ డౌన్ నేప‌థ్యాల్ని, క‌రోనా క‌ష్టాల్నీ, దీని వెనుక ఉన్న నిజాల్ని చెప్పేందుకు క‌థ‌కులు, ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. చిత్ర‌సీమ‌లో ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను ‘క‌రోనా’ ప్రాజెక్టులు స్క్రిప్టు ద‌శ‌లో ఉన్నాయి.

అల్ల‌రి న‌రేష్ కూడా క‌రోనాపై ఓ క‌థ రాశాడ‌ట‌. ప్రస్తుతం దాన్ని సినిమా కొల‌త‌ల‌కు స‌రిప‌డా స్క్రిప్టుగా మ‌ల‌చ‌డంలో బిజీగా ఉన్నాడ‌ట‌. క‌రోనా క‌థ అని చెప్పి – సైంటిఫిక్ విష‌యాలేం ఉండ‌వు. లాక్ డౌన్ స‌మ‌యంలో స‌గ‌టు భ‌ర్త ఇంట్లో ఎలాంటి బాధలు ప‌డ్డాడో చెబుతూ ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని రాసుకున్నాడ‌ట న‌రేష్‌. ఈ క‌థ మ‌రో ద‌ర్శ‌కుడి చేతిలో పెట్టి, సినిమాగా మ‌ల‌చాల‌న్న‌ది న‌రేష్ ప్ర‌య‌త్నం. ”లాక్ డౌన్ ఒకొక్క‌రికీ ఒక్కో అనుభ‌వాన్ని ఇచ్చింది. నాకూ కొన్ని గ‌మ్మ‌త్తైన అనుభ‌వాలు ఉన్నాయి. వాటి నేప‌థ్యంలో స‌ర‌దాగా ఓ క‌థ రాశాను. ఓ మంచి రైట‌ర్ చేతిలో పెట్టి.. స్క్రిప్టుగా మార్చాలి. అయితే ఈ క‌థ‌కు నేను ద‌ర్శ‌కత్వం వ‌హించ‌ను” అన్నాడు న‌రేష్. అన్న‌ట్టు ఈరోజు న‌రేష్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ‘నాంది’ టీజ‌ర్ విడుద‌లైంది. ఆ టీజ‌ర్‌కి మంచి స్పంద‌న వ‌స్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close