చైతన్య : కేసీఆర్ గారూ.. వైరస్‌ను  ఎప్పుడు తరిమికొడుతున్నారు..?

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న సమయంలో కేసీఆర్ చేసిన ప్రకటనలు.. ఇండియాలో లాక్ డౌన్ విధించిన తర్వాత.. చేసిన ఆర్భాటాలు.. ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కేసీఆర్ మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయన చెబుతున్నదానికి.. చేస్తున్నదానికి పొంతన లేకపోవడమే దీనికి కారణం. ఇటీవలి కాలంలో కేసీఆర్ ప్రెస్‌మీట్లు పెట్టడం కూడా మానేశారు. గతంలో ఎప్పుడు కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష చేసినా ప్రెస్‌మీట్ పెట్టేవారు. ఇప్పుడు ఎలాంటి ప్రెస్‌మీట్ పెట్టడం లేదు.

అందరూ గాంధీకేనన్నారు.. టీఆర్ఎస్ నేతలు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రులకా..?

కేసీఆర్ మాటల మాంత్రికుడు. తిమ్మిని బమ్మిని చేయగల సామర్థ్యం ఉన్న నాయకుడు. అందులో సందేహం లేదు. కానీ కరోనా విషయంలో ఆయన చెప్పిన మాటలు.. రివర్స్ అవుతున్నాయి. ఎంత కోటీశ్వరుడైనా.. కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలో చేరాల్సిందేనని ఆయన ఓ డైలాగ్‌ను ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఇప్పుడు అది రోజూ చర్చకు వస్తోంది. ఎందుకంటే.. హోంమంత్రి మహమూద్ అలీ దగ్గర్నుంచి డిప్యూటీ స్పీకర్ పద్మారావు వరకూ.. తన పార్టీకే చెందిన కీలక నేతలంతా.. గాంధీ జోలికి పోవడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరిపోతున్నారు. వారి బిల్లులు ప్రభుత్వానికే వస్తాయి. అంటే ప్రజలే భరించాలి. కానీ .. అన్ని సౌకర్యాలు.. కావాల్సిన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం.. వారిని ఆయా ఆస్పత్రులకు తరలించడం లేదు. ఈ ప్రశ్న అదే పనిగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

రూ. వెయ్యి కోట్లు ఎప్పుడు ఖర్చు పెడుతున్నారు..?

అసెంబ్లీలో కరోనా గురించి కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేవనెత్తినప్పుడు.. వారిని చాలా హేళన చేశారు కేసీఆర్. మాస్క్‌ల కొరత ఉన్నందుకు.. ఆయన తన మాటల చాతుర్యాన్ని ప్రదర్శించి.. కాంగ్రెస్ సభ్యులను అవమానించారు. కరోనా తెలంగాణకు రానే రాదని.. ఒక వేళ వచ్చినా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి.. దాన్ని అంతం చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు.. తెలంగాణలో పరిస్థితి దారుణంగా ఉంది. టెస్టులకే దిక్కులేకుండా పోయిది. రోగులు అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వీడియోలు బయటకు వస్తున్నాయి. జిల్లాల వారీగా కోవిడ్ ఆస్పత్రులను కూడా ఏర్పాటు చేయలేకపోయారు. కేంద్ర బృందం కూడా తెలంగాణ సర్కార్ చేస్తున్న ఏర్పాట్లు చూసి.. అసంతృప్తి వ్యక్తం చేయాల్సి వచ్చింది. పరిస్థితి చేయిదాటిపోయే సమయంలో.. కేంద్రం నిధులివ్వడం లేదంటూ.. ఈటల లాంటి వాళ్లు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

ప్రశ్నించిన వాళ్లందరికీ కరోనా రావాలని శాపాలు..! ఇప్పుడేం జరుగుతోంది..?

కేసీఆర్ ప్రెస్‌మీట్లలో చాలా మందిపై విరుచుకుపడేవారు. మీడియాలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై కథనాలు వస్తే.. వారికి కరోనా వస్తుందని.. రావాలని శాపాలు పెట్టేవారు. దీనిపై ఓ సారి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలా రావాలని కోరుకునే స్థాయి వ్యక్తిత్వం సీఎంకు ఉండకూడదని తేల్చేశారు. కొంత మంది రిపోర్టర్లపైనా కేసీఆర్ విరుచుకుపడేవారు. ఇప్పుడు.. టీఆర్ఎస్ నేతలే అత్యధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. నిజానికి కరోనాకు ఎలాంటి బేధాల్లేవు..అందర్నీ సమానంగా అంటుకుంటోంది.. కానీ అధినేత తీసుకున్న నిర్లక్ష్య పూరిత విధానం కారణంగా.. టీఆర్ఎస్ నేతలు కూడా లైట్ తీసుకోవడంతో.. వారు ఎక్కువ కరోనా బారిన పడుతున్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

కేసీఆర్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు.. చివరికి వరకూ అలా నింపాదిగా ఉండి.. లాస్ట్‌లో సిక్సర్ కొట్టడం అలవాటు. ఇటీవలి కాలంలో ఆర్టీసీ సమ్మె దగ్గర్నుంచి సంతోష్ బాబు కుటుంబానికి పరామర్శ వరకూ.. అన్నీ ఇలాగే చేశారు. కరోనాను ఎదుర్కోవడం లేదని.. ప్రజల్ని అలా వదిలేశారని.. వస్తున్న విమర్శలకు కూడా కేసీఆర్ తనదైన శైలిలో .. చెక్ పెట్టొచ్చు. అయితే.. ఈ విమర్శలు హైరేంజ్‌కు వెళ్లాయని నిర్ణయించుకున్న తర్వాత కేసీఆర్ రంగంలోకి దిగుతారు. రాజకీయంలో ఆయనను మించిన మొనగాడు తెలంగాణలో లేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close