విధేయతను బట్టే శాఖలు..! హోంమంత్రిగా సుచరిత..!

నవ్యాంధ్రప్రదేశ్‌కు మొదటి మహిళా హోంమంత్రిగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే.. మేకతోటి సుచరిత విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమెకు.. ప్రభుత్వంలో నెంబర్‌ టూ గా భావించే హోంశాఖను ఆమెకు అప్పగించారు. ఉదయం.. మంత్రులందరితో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. కాసేపటికే… ఇరవై ఐదు మంది మంత్రులకు శాఖలకు కేటాయిస్తూ… అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా పాముల పుష్పశ్రీవాణి ( ఎస్టీ ), పిల్లి సుభాష్ చంద్రబోస్ ( బీసీ ), ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ( కాపు ) , కే నారాయణస్వామి ( ఎస్సీ ), అంజాద్ బాషా ( మైనార్టీ ) లను ప్రకటించారు.

ప్రభుత్వంలో నెంబర్ టూగా భావించే.. హోంశాఖను… చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మహిళా మంత్రి వైపు మొగ్గు చూపారు. ఊహించినట్లుగానే… డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఆర్థిక శాఖను అప్పగించారు.

ధర్మాన కృష్ణదాస్రోడ్లు భవనాలు
బొత్స సత్యనారాయణమున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్
పుష్పశ్రీవాణి ( డిప్యూటీ సీఎం )గిరిజన సంక్షేమం
అవంతి శ్రీనివాస్ పర్యాటకం
కన్నబాబు వ్యవసాయం
పిల్లి సుభాష్ ( డిప్యూటీ సీఎం ) రెవిన్యూ
పినిపె విశ్వరూప్ సాంఘిక సంక్షేమం
ఆళ్ల నాని ( డిప్యూటీ సీఎం )వైద్య ఆరోగ్య శాఖ
శ్రీరంగనాథరాజు హౌసింగ్
తానేటి వనితమహిళా శిశు సంక్షేమం
కొడాలి నానిపౌరసరఫరాలు
పేర్ని నానిరవాణా, ఐ అండ్ పీఆర్
వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ
మేకతోటి సుచరితహోం
మోపిదేవి వెంకటరమణ మత్స్యశాఖ, మార్కెటింగ్
బాలినేని శ్రీనివాస్ రెడ్డి అడవులు, పర్యావరణశాఖ
అదిమూలపు సురేష్విద్యాశాఖ
అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్
గౌతం రెడ్డిఐటీ , పరిశ్రమల శాఖ
పెద్దిరెడ్డి పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి, గనులు
నారాయణస్వామి ( డిప్యూటీ సీఎం )ఎక్సైజ్, వాణిజ్య పన్నులు
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ
గుమ్మనూరు జయరాంకార్మిక శాఖ
అంజాద్ భాషా ( డిప్యూటీ సీఎం ) మైనారిటీ సంక్షేమం
శంకర్ నారాయణబీసీ సంక్షేమం

కొడాలి నానికి కీలకమైన శాఖ దక్కుతుందన్న ప్రచారం జరిగింది కానీ… ఆయకు పౌరసరఫరాల శాఖ మాత్రమే దక్కింది. సాధారణంగా… ప్రభుత్వంలో … ముఖ్యమంత్రి తర్వాత హోంమంత్రికి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అందుకే.. ఎక్కువగా… తమ ఆదేశాలు పాటించేవాళ్లు.. సొంత నిర్ణయాలు తీసుకోని వాళ్లనే.. ముఖ్యమంత్రులుగా .. హోంమంత్రిగా ఎంపిక చేసుకుంటారు. బహుశా…జగన్మోహన్ రెడ్డి కూడా అదే ప్లాన్ ను అమలు చేసి ఉంటారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close