జనసేనకు మొదటి షాక్.. ! రావెల కిషోర్ జంప్..!

జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. ఆయన నేరుగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆమోదించాలని.. పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. కిషోర్ బాబు.. ప్రధాని మోడీ సమక్షంలో… ఆదివారం.. భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణతో.. ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తిరుపతి పర్యటనకు వస్తున్న మోడీ.. రేపు సాయంత్రం… శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. ఈ సమయంలో.. ఎక్కడో చోట రావెల కిషోర్‌కు కండువా కప్పనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి జనసేన తరపున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన రావెల కిషోర్ బాబు.. మూడో స్థానంలో నిలిచారు. పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ.. కొన్ని టీడీపీ ఓట్లను మాత్రం చీల్చగలిగారు. దాంతో అక్కడ.. వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత విజయం సాధించారు. ఆమె ఇప్పుడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జనసేనలో ఉంటే.. రాజకీయ భవిష్యత్ ఉండదనుకున్న.. రావెల కిషోర్.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందుకే… పవన్ కల్యాణ్‌ జరుపుతున్న సమీక్షా సమావేశాలకు కూడా రావెల కిషోర్ హాజరు కావడంలేదు.

గతంలోకేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న రావెల.. ఒకప్పుడు… భారత స్పీకర్‌గా పని చేసిన జీఎంసీ బాలయోగి వద్ద… పని చేసేవారు. ఆ పరిచయంతో.. టీడీపీలో.. చేరి 2014లో ప్రత్తిపాడు టిక్కెట్ సంపాదించగలిగారు. అనూహ్యంగా విజయం సాధించడంతో.. సామాజిక సమీకరణాల లెక్కలో మంత్రి పదవి కూడా దక్కింది. కానీ వివాదాస్పద రాజకీయ ప్రవర్తన కారణంగా.. ఆయనను మధ్యలోనే పదవి నుంచి తొలగించారు చంద్రబాబు. ఆ తర్వాత టీడీపీలో ఉంటే టిక్కెట్ కూడా ఇవ్వరన్న ఉద్దేశంతో.. వైసీపీ చేరేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో.. జనసేనలో చేరారు. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో.. ఏదో ఓ పదవి వస్తుందన్న ఉద్దేశంతో.. ఆ పార్టీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల తర్వాత జనసేనలో ఉన్నవారిలో కాస్త ప్రముఖ నేతను పవన్ కల్యాణ్ కోల్పోతున్నట్లే భావించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close