సరైనోడుతో ఆల్ రౌండర్ అవుతారా..!

శుక్రవారం రిలీజ్ అవుతున్న సరైనోడు సినిమా కోసం మెగా అభిమానుల హడావిడి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా హీరో అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటిలకు సరైనోడు పెద్ద పరిక్షే పెట్టిందని చెప్పాలి. సరైనోడు సినిమాలో ఎప్పుడూ చూడని మాస్ ఎలిమెంట్స్ తో కనిపిస్తూ తన స్టైల్ కు కొత్త రూపాన్ని తీసుకొచ్చాడు అల్లు అర్జున్. అయితే స్టైలిష్ స్టార్ అన్న పేరున్న ఈ హీరో ఇలాంటి ఊర మాస్ సినిమాతో కూడా మెప్పిస్తాడా లేదా అన్నది చర్చించాల్సిన అంశం. ఇక ఈ సినిమా హిట్ అయితే బన్నిని అదే మన అల్లు అర్జున్ ను ఆల్ రౌండర్ అనాల్సిందే.

ఇక స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే కత్తులతో శత్రువులను రక్తపుటేరుల్లో పరుగెత్తేలా చేసే దర్శకుడు బోయపాటి శ్రీను కెరియర్ లో సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్స్ ఉన్నా స్టార్ డైరక్టర్ ట్యాగ్ మాత్రం తగిలించుకోలేకపోయాడు. ట్రెండ్ సెట్ మూవీస్ తీస్తున్నా బోయపాటి మార్క్ ఇంకా పడట్లేదనే అనాలి. అయితే అల్లు అర్జున్ లాంటి స్టైలిష్ యాక్టర్ తో సరైనోడు సినిమా తీసిన బోయపాటి తాను కూడా దర్శకుడిగా ఆల్ రౌండర్ అనిపించుకుంటాడో లేదో చూడాలి. మరి సరైనోడు సినిమా దర్శకుడు, హీరో ఇద్దరు ఆల్ రౌండర్ గా సినిమా బ్లాక్ బస్టర్ కొడతారో లేదో సినిమా ఫలితంతో తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే పోతిన లేకపోతే పోసాని – పిచ్చెక్కిపోతున్న వైసీపీ !

పవన్ కల్యాణ్ రాజకీయంతో వైసీపీకి దిక్కు తోచని పరిస్థితి కనిపిస్తోంది. ఆయనపై కసి తీర్చుకోవడానికి వ్యక్తిగత దూషణలు.. రూమర్స్ ప్రచారం చేయడానికి పెయిడ్ ఆర్టిస్టుల్ని ప్రతీ రోజూ రంగంలోకి తెస్తున్నారు. గతంలో పోసాని...

టాలీవుడ్ మార్కెట్ పెంచుకుంటున్న కన్నడ స్టార్

ఈ మధ్య భాషా బేధాలు లేకుండా అన్ని భాషలకి చెందిన సూపర్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్రేజీ కాంబినేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్...

కేసీఆర్ కు ఏమైంది..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రిక్కించి వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇదంతా గతం. అధికారం కోల్పోయాక ఆయన ప్రసంగంలో మునుపటి వాగ్ధాటి కనిపించడం లేదనే అభిప్రాయాలు...

బొత్స తండ్రి సమానుడా ? : షర్మిల

వైఎస్ జగన్ బొత్సను తన తండ్రి సమానుడు అని అనడం.. ఆయన విచిత్రమైన హావభావాలతో కంట తడిపెట్టుకున్నట్లుగా నటించడం, తర్వాత కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయడం విజయనగరం సిద్ధం సభలో కనిపించిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close