బ‌న్నీతో ‘ఐకాన్‌’ తీస్తాం: దిల్ రాజు క్లారిటీ

అల్లు అర్జున్ – వేణు శ్రీ‌రామ్ ల‌తో `ఐకాన్‌` అనే సినిమా ప‌ట్టాలెక్కించాల‌ని చూశాడు దిల్ రాజు. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ఆగిపోయింది. అయితే… త‌లుపులైతే.. మూసుకుపోలేదు. ఇంకా ఆ సినిమాపై ఆశ‌లున్నాయి. కాస్త ఆల‌స్య‌మైనా `ఐకాన్‌` సినిమా తీస్తామ‌ని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. `వ‌కీల్ సాబ్` ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా `ఐకాన్‌` ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. వేణు శ్రీ‌రామ్ తో ఈ సినిమా తీస్తామ‌ని, త్వ‌ర‌లోనే అల్లు అర్జున్ ఈ సినిమా గురించిన ఓ ప్ర‌క‌ట‌న ఇస్తార‌ని చెప్పారాయ‌న‌.

రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ కాంబినేష‌న్ లో దిల్ రాజు ఓ సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై కూడా దిల్ రాజు స్పందించారు. మే, జూన్‌ల‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని, హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నామ‌ని, ఆ వివ‌రాల‌న్నీ త్వ‌ర‌లో చెబుతామ‌న్నారు. దిల్ రాజు నిర్మించిన వ‌కీల్ సాబ్ ఈనెల 9న విడుద‌ల కానుంది. ఈ సినిమాపై చాలా న‌మ్మ‌కంగా ఉన్నారాయ‌న‌. అడ్వాన్సు బుకింగ్ లు మ‌హా జోరుగా ఉన్నాయ‌ని, ఎన్ని థియేట‌ర్లు పెంచినా, టికెట్లు అయిపోతున్నాయ‌ని, వ‌కీల్ సాబ్ త‌ప్ప‌కుండా ఓ మ్యాజిక్ చేస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారాయ‌న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close