రియాక్షన్.. ఆంధ్రజ్యోతి గోడౌన్ కూల్చివేత..!

వైఎస్ కుటుంబంలో జరుగుతున్న విషయాలను “కొత్తపలుకు” ద్వారా బయటపెడుతున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై కొద్దిరోజులుగా వైసీపీ పెద్దలు అసహనంతో ఉన్నారు. ఎప్పుడూ అసహనంతోనే ఉంటారు. కానీ ఢిల్లీలో వైఎస్ సునీత ప్రెస్ మీట్ .. ఆ తదనంతర వార్తల నేపధ్యంలో తక్షణం ఏదో ఒకటి చేయాలన్న అసహనంతో ఊగిపోయారు. ఆ విషయం వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డి పేరుతో రిలీజైన లేఖలో ఆంధ్రజ్యోతిపై ఉన్న పదజాలంతోనే తేలిపోయింది. చివరికి వారికి విశాఖలోనే ఓ గోడౌన్ కనిపించింది. ఆ గోడౌన్‌ను కూల్చేశారు. ఆ ప్రైవేటు గోడౌన్‌లోనే ఆంధ్రజ్యోతి పత్రిక ప్రింటింగ్ ప్రెస్ ఉంది. దాన్ని టార్గెట్ చేసుకున్నారు. ముందస్తు నోటీసుల్లేవు.. వీకెండ్ కూడా చూసుకోలేదు. రంగంలోకి దిగిపోయారు.

కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకునేలోపు.. కూల్చివేయగలిగినన్ని జేసీబీలు ముందుగానే తీసుకెళ్లడంతో… కూల్చివేత పని దాదాపుగా పూర్తి చేసుకున్నారు. చివరికి ప్రైవేటు గోడౌన్ యాజమాన్యం హుటాహుటిన హైకోర్టుకు వెళ్లి…మధ్యాహ్నం తర్వాత స్టేటస్ కో ఉత్తర్వులు తెచ్చుకోగలిగింది. అయితే అప్పటికే దాదాపుగా కూల్చివేత పూర్తయింది. ఇప్పుడు ఆ కూల్చివేత శిధిలాలు అలాగే ఉంటాయి. ప్రభుత్వ పెద్దల పంతం నెరవేరింది. ఏపీఐఐసీ భూముల్లో ఆ గోడౌన్లను నిర్మించారు. అయితే అనుమతించినదాని కంటే ఎక్కువగా కట్టారంటూ.. వాటిని ఏపీఐఐసీ అధికారులు.. రెవిన్యూ అధికారులు కలిసి కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధమో.. అనుకూలమో.. ఏదో ఒకటి.. ఏం చేసినా నిబంధనల ప్రకారం చేయడం అనేది ఇప్పటి వరకూ ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. నోటీసులు ఇచ్చి.. వివరణ తీసుకుని ఆ తర్వాత స్పందన లేకపోతే కూల్చివేతల దగ్గరకు వెళ్తాయి.

ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న గోడౌన్లకు అనుమతుల్లేవంటూ ఇప్పుడు కూల్చడం ఖచ్చితంగా కక్ష సాధింపేనన్న విమర్శలు సహజంగానే వస్తాయి. వస్తున్నాయి కూడా. అయితే ప్రభుత్వం .. పెద్దలు ఇలాంటి విమర్శలను పొగడ్తలుగా భావించే పరిస్థితి ఉంది. పైగా ఇప్పుడు… ఏదో ఒకటి చేయాల్సిందేనన్న పట్టుదల. దాంతో పని పూర్తి చేసుకున్నారు. గతంలోనే విశాఖలో ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఓ స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దానిపై కోర్టుకెళ్లి ఆంధ్రజ్యోతి యాజమాన్యం స్టే తెచ్చుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close