టీఆర్ఎస్‌లో విలీనమైన టీటీడీఎల్పీ..!

తెలంగాణలో తెలుగుదేశం ఉనికిని ఇప్పటి వరకూ కాపాడుతున్న అశ్వారావుపేట ఎమ్మెల్యె మెచ్చా నాగేశ్వరరావు కూడా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. గత ముందస్తు ఎన్నికల్లో టీడీపీ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఒకరు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. మరొకరు.. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. ఎన్నికల ఫలితాలొచ్చిన కొద్ది రోజులకే సండ్ర టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అధికారికంగా చేరలేదు. అయితే ఆయన టీఆర్ఎస్ నేతగానే చెలామణి అవుతున్నారు. అప్పట్లోనే మెచ్చా నాగేశ్వరరావును కూడా పార్టీలో చేరాలని టీఆర్ఎస్ నేతలు ఆహ్వానించారు.

తనకు కేసీఆర్ ఏం కావాలన్నా ఇస్తానన్నారని.. కానీ తానే చేరదల్చుకోలేదని మెచ్చా నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. రెండేళ్లలోనే ఆయన మనసు మారింది. చడీచప్పుడు లేకుండా ఇప్పుడు నేరుగా… టీఆర్ఎస్‌లో చేరిపోయారు. టీఆర్ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీని విలీనం చేస్తూ.. లేఖను స్పీకర్‌కు ఇచ్చారు. దీంతో సండ్ర, మెచ్చా ఇద్దరూ పార్టీ ఫిరాయింపు అనే బాధ లేకుండా.. టీఆర్ఎస్‌లో కలిసిపోయినట్లవుతుంది. గతంలోనూ ఓ సారి టీడీఎల్పీని టీఆర్ఎస్ విలీనం చేసుకుంది. ఇది రెండో సారి.

తెలంగాణలో టీడీపీ రాను రాను బలహీనపడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ స్వయంగా పోటీ చేసినప్పటికీ.. కనీస ఓట్లు సంపాదించుకోలేకపోయారు. ఇక టీడీపీ ఉనికి కష్టమేనని అనుకుంటున్న సమయంలో మెచ్చా నాగేశ్వరరావు తన రాజకీయ భవిష్యత్ తాను చూసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close